IND vs NZ 2nd T20I: పృథ్వీ షా ఇన్.. అర్ష్‌దీప్‌ ఔట్.. లక్నోలో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

IND vs NZ 2nd T20I Playing XI: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండవ టీ20ఐ మ్యాచ్ ఆదివారం, జనవరి 29 లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.

IND vs NZ 2nd T20I: పృథ్వీ షా ఇన్.. అర్ష్‌దీప్‌ ఔట్.. లక్నోలో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?
Ind Vs Nz T20i Series
Follow us

|

Updated on: Jan 29, 2023 | 10:00 AM

India vs New Zealand 2nd T20I Playing XI: భారత్ – న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రెండో మ్యాచ్ రేపు అంటే ఆదివారం లక్నోలో జరగనుంది. రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇలాంటి పరిస్థితుల్లో లక్నోలో టీమిండియా ఓడిపోతే సిరీస్‌ను చేజార్చుకున్నట్టే. అందుకే టీమ్‌ఇండియా డూ ఆర్‌ డై అనేలా ఉంది.

తొలి టీ20లో 19 ఓవర్ల పాటు మ్యాచ్‌ను ఆన్‌లోనే ఉంచిన టీమిండియా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ ఓవర్‌లో (ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌లో) 27 పరుగులు రావడంతో మ్యాచ్‌ కివీస్‌ జట్టు చేతుల్లోకి వెళ్లింది. న్యూజిలాండ్ భారత్‌కు 177 పరుగుల లక్ష్యాన్ని అందించగా, దానికి సమాధానంగా టీమిండియా టాప్ ఆర్డర్ కేవలం 15 పరుగులకే కుప్పకూలింది.

పృథ్వీ షాకి అవకాశం వస్తుందా?

రెండో టీ20లో పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలా వద్దా అనేది కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందున్న అతిపెద్ద ప్రశ్నగా నిలిచింది. ఇషాన్ కిషన్‌తో ఓపెనింగ్ చేయాలని క్రికెట్ నిపుణుల నుంచి అభిమానుల వరకు షాను డిమాండ్ చేస్తున్నారు. అయితే, తొలి టీ20కి ముందు హార్దిక్ శుభ్‌మన్ గిల్‌పై విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

తెరపైకి అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టాలనే డిమాండ్..

తొలి టీ20లో భారత్‌ ఓటమికి అర్ష్‌దీప్‌ సింగ్‌ విలన్‌గా నిలిచాడు. ఇలాంటి పరిస్థితుల్లో రెండో టీ20లో అతడిని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అర్ష్‌దీప్‌ని ప్లేయింగ్ XI నుంచి తొలగిస్తే, యుజ్వేంద్ర చాహల్ తిరిగి జట్టులోకి రావచ్చు.

శుభమన్ వర్సెస్ పృథ్వీ..

టీ20లో గిల్ 119.92తో చెత్త పవర్‌ప్లే స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఇప్పటివరకు తన నాలుగు ఇన్నింగ్స్‌లలో, గిల్ మూడు సింగిల్ డిజిట్ స్కోర్‌లను కలిగి ఉన్నాడు.

గిల్ వన్డేల్లో అద్భుతంగా ఆకట్టుకోగా, టీ20ల్లో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. మరి రెండో టీ20ఐలో గిల్‌కు అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

పృథ్వీ షా పునరాగమనంతో భారత జట్టు పటిష్టంగా మారనుంది. అతను తుఫాన్ బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో షా స్ట్రైక్ రేట్ 152.34గా నిలిచింది. ఇది సూర్యకుమార్ యాదవ్ కంటే కూడా టీమ్ ఇండియాలో అత్యుత్తమంగా ఉంది.

రెండో టీ20లో టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ XI – ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్