India vs Ireland 2nd T20: నేడు ఐర్లాండ్‌తో రెండో టీ20.. టీమిండియా ప్లేయింగ్ -XI లో రెండు మార్పులు !
India vs Ireland 2nd T20 Playing 11 Prediction: భారత్, ఐర్లాండ్‌ల మధ్య రెండు మ్యాచ్‌ల T20 సిరీస్ లో భాగంగా మంగళవారం (జూన్28) ఆఖరి, రెండో మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ..
India vs Ireland 2nd T20 Playing 11 Prediction: భారత్, ఐర్లాండ్‌ల మధ్య రెండు మ్యాచ్‌ల T20 సిరీస్ లో భాగంగా మంగళవారం (జూన్28) ఆఖరి, రెండో మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ సత్తాచాటాలని భావిస్తోంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్‌ను 12 ఓవర్లకే కుదించడంతో ఈ మ్యాచ్‌లోనైనా పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించాలని హార్దిక్ సేన ఆకాంక్షిస్తోంది. మొదటి మ్యాచ్ జరిగిన డబ్లిన్‌లోని మలాహిడ్ మైదానమే ఈ పోరుకు వేదిక కానుంది. ఆరంభ పోరులో టీమిండియా పెద్దగా కష్టపడనప్పటికీ కొన్ని విషయాల్లో మెరుగుకావాల్సి ఉంది. ఒకటి ఈ మ్యాచ్ నుంచి అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఉమ్రాన్ మాలిక్ ఆరంభం కాగా, రెండోది రుతురాజ్ గైక్వాడ్ గాయం.
రుతురాజ్ స్థానంలో సంజూ..
ఫామ్‌లో ఉన్న రుత్‌రాజ్ రెండో టీ20కి కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో అతను మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో అతని స్థానంలో దీపక్ హుడా ఓపెనింగ్ వచ్చాడు.క మ్యాచ్ అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. గైక్వాడ్ మోకాలి గాయంతో బాదపడుతున్నట్లు హార్ధిక్ తెలిపాడు. ఒక వేళ ఈ మ్యాచ్‌కు గైక్వాడ్ దూరమైతే అతడి స్థానంలో సంజూ శాంసన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మినహా బ్యాటింగ్‌లో పెద్దగా మార్పులుండవని తెలుస్తోంది.
ఉమ్రాన్ పైనే అందరి దృష్టి..
ఇక బౌలింగ్ విషయానికొస్తే.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఉమ్రాన్ చివరి మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. అయితే వర్షం అతని ఆశలకు చెక్ పట్టింది. 12 ఓవర్ల మ్యాచ్‌లో కేవలం ఒక ఓవర్ మాత్రమే వేసిన మాలిక్ 14 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఒకే ఒక్క ఓవర్‌తో అతని ప్రతిభను తక్కువ చేయలేమని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీంతో రెండో మ్యాచ్‌లోనూ ఈ జమ్మూ ఎక్స్‌ప్రెస్‌కు చోటు దక్కవచ్చు. అయితే రెండో మ్యాచ్‌లోనూ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు ప్లేయింగ్- XIలో స్థానం దక్కకపోవచ్చు. అతని స్థానంలో హర్షల్ పటేల్ లేదా అర్ష్‌దీప్‌కు చోటు ఖాయంగా కనిపిస్తోంది.
ఎలాంటి మార్పుల్లేకుండా..
ఐర్లాండ్ విషయానికి వస్తే.. మొదటి మ్యాచ్‌లో ఐరిష్ జట్టు బ్యాటింగ్ చాలా నిరాశపరిచింది. అయినా ఎలాంటి మార్పుల్లేకుండా రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది ఐర్లాండ్. అయితే, వెటరన్ స్పిన్నర్ ఆండీ మెక్‌బ్రైన్ ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో పక్కనపెట్టవచ్చు.
రెండో మ్యాచ్‌కి భారత జట్టు (అంచనా):
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్/సంజు శాంసన్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్/హర్షల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్.
ఐర్లాండ్:
ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), పాల్ స్టిర్లింగ్, గారెత్ డెలానీ, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, ఆండీ మెక్‌బ్రైన్, క్రెయిగ్ యంగ్, జోష్ లిటిల్, కోనర్ ఓల్ఫెర్ట్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..