IND VS IRE: గంటకు 201 కిలోమీటర్ల వేగంతో భువనేశ్వర్ బౌలింగ్.. నెట్టింట వైరలవుతోన్న న్యూస్‌లో నిజమెంతంటే..
Bhuvneshwar Kumar: ప్రపంచంలో అత్యంత ఫాస్ట్ బౌలర్లు ఎవరంటే షోయబ్ అక్తర్, బ్రెట్‌లీలే గుర్తొస్తారు. 2002 లో పాక్ స్పీడ్‌స్టర్ అక్తర్.. ఓ మ్యాచ్ లో గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ ప్రపంచ క్రికెట్ లో ఇదే రికార్డు.
Bhuvneshwar Kumar: ప్రపంచంలో అత్యంత ఫాస్ట్ బౌలర్లు ఎవరంటే షోయబ్ అక్తర్, బ్రెట్‌లీలే గుర్తొస్తారు. 2002 లో పాక్ స్పీడ్‌స్టర్ అక్తర్.. ఓ మ్యాచ్ లో గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ ప్రపంచ క్రికెట్ లో ఇదే రికార్డు. బ్రెట్‌లీ, షాన్ టెయిట్ కూడా అత్యంత వేగంగా బంతిని విసిరిన బౌలర్లే. ఇప్పుడిక టీమిండియా యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ వీరి సరసన చేరడానికి తీవ్రంగా సాధన చేస్తున్నాడు. ఐపీఎల్‌లో అతను గంటకు 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు. అయితే ఇప్పుడు వీరిని కాదంటూ అత్యంత ఫాస్టెస్ట్ బాల్ విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు టీమిండియా స్వింగ్ కింగ్ భువనేశ్వర్. అదేంటి ఎప్పుడూ భువీ వేసే బౌలింగ్ స్పీడ్ మహా అయితే గంటకు 140 కి.మీ. దాటదు కదా. 201కిలోమీటర్ల వేగంతో ఎలా బంతిని విసరాడు? అనుకుంటున్నారా? అయితే అసలు విషయం తెలుసుకుందాం రండి.
సాధారణంగా స్పీడ్ కంటే టెక్నిక్‌నే ప్రధానంగా తీసుకుని బౌలింగ్ చేస్తాడు భువీ. తన స్వింగ్‌తోనే బ్యాటర్ల భరతం పడతాడు. ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లోనూ అలాగే బంతిని విసిరాడు. అయితే భువీ వేసిన ఐర్లాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతిని స్పీడ్ గన్ ఏకంగా 125 ఎంపీహెచ్ (గంటకు 201 కి.మీ) గా చూపించింది. స్పీడ్ గన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్లే ఈ తప్పిదం జరిగింది. దీంతో నెటిజన్లు ఈ విషయాన్ని గుర్తించి ఐర్లాండ్ క్రికెట్ ను ఆటాడుకుంటున్నారు. ‘షోయబ్ అక్తర్, బ్రెట్‌లీ, ఉమ్రాన్ మాలిక్ ఎవరు..? క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ బాల్ వేసింది భువనేశ్వర్ కుమార్. ఇది ప్రపంచ రికార్డు. ఇదే సాక్ష్యం’ ఫన్నీ కామెంట్లు కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన భువీ కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అందులో ఓ మెయిడిన్ కూడా ఉండడం విశేషం.
WORLD RECORD❗
bhuvneshwar kumar delivered a ball at 201 KMPH. Fastest ball of cricket history. Sheering pace from bhuvi ?#IREvIND #indvsire pic.twitter.com/sz3JDz1Vzu
— Rohit.Bishnoi (@The_kafir_boy_2) June 26, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..