IND vs AUS: ఫిబ్రవరి 9న భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్.. లంక, కివీస్‌లతోనూ.. పూర్తి షెడ్యూల్ మీకోసం..
Team India: ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు కొత్త సంవత్సరం ప్రారంభంలో శ్రీలంక, న్యూజిలాండ్‌లతో భారత్ వైట్ బాల్ సిరస్‌లు ఆడనుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
2022లో టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే బంగ్లాతో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. టెస్ట్ సిరీస్‌లోనైనా విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక పరాజయంతో మొదలైన భారత్ ప్రయాణం.. విజయంతో ఈ ఏడాదిని ముగించాలని అంతా కోరుకుంటున్నారు. ఇక అందరి ఆశలు 2023లో టీమిండియా ప్రదర్శనపై ఎలా ఉంటుందోనని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 2023లో టీమిండియా షెడ్యూల్ సిద్ధమైంది. తాజాగా బీసీసీఐ వచ్చే ఏడాది భారత పర్యటనకు వచ్చే దేశాల వివరాలను ప్రకటించింది. అవేంటో ఓసారి చూద్దాం..
ఫిబ్రవరి 9, 2023న నాగ్‌పూర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుందని బీసీసీఐ ప్రకటించింది. ఇరుజట్లు నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో తలపడనున్నాయి. తొలి టెస్ట్ అనంతరం మూడు రోజుల విరామం తర్వాత ఢిల్లీ(ఫిబ్రవరి 17-21)లో రెండో టెస్ట్ జరగనుంది. ధర్మశాలలో మూడో టెస్టు (మార్చి 1-5) ముందు జట్లకు వారం రోజుల విశ్రాంతి లభించింది. ఇక నాలుగో టెస్ట్ అహ్మదాబాద్‌లో (మార్చి 9-13) జరగనుంది.
అనంతరం మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లు పోటీపడనున్నాయి. ముంబయి (మార్చి 17), విశాఖపట్నం (మార్చి 19), చెన్నై (మార్చి 22)లో మూడు వన్డేలు జరగనున్నాయి. దీంతో ఆస్ట్రేలియా పర్యటన ముగుస్తుంది. అనంతరం IPL తదుపరి సీజన్‌కు భారత్ వేదిక కానుంది.
ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు కొత్త సంవత్సరం ప్రారంభంలో శ్రీలంక, న్యూజిలాండ్‌లతో భారత్ వైట్ బాల్ సిరస్‌లు ఆడనుంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇండియా హోమ్ సీజన్ 2023 షెడ్యూల్ వివరాలు..
భారత్‌లో శ్రీలంక పర్యటన..
తేదీ | మ్యాచ్ | వేదిక |
---|---|---|
జనవరి 3 | 1వ టీ20 | ముంబై |
జనవరి 5 | 2వ టీ20 | పూణే |
జనవరి 7 | 3వ టీ20 | రాజ్‌కోట్ |
జనవరి 10 | 1వ వన్డే | గౌహతి |
జనవరి 12 | 2వ వన్డే | కోల్‌కతా |
జనవరి 15 | 3వ వన్డే | త్రివేండ్రం |
న్యూజిలాండ్ భారత పర్యటన..
తేదీ | మ్యాచ్ | వేదిక |
---|---|---|
జనవరి 18 | 1వ వన్డే | హైదరాబాద్ |
జనవరి 21 | 2వ వన్డే | రాయ్పూర్ |
జనవరి 24 | 3వ వన్డే | ఇండోర్ |
జనవరి 27 | 1వ టీ20 | రాంచీ |
జనవరి 29 | 2వ టీ20 | లక్నో |
ఫిబ్రవరి 1 | 3వ టీ20 | అహ్మదాబాద్ |
భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన..
తేదీ | మ్యాచ్ | వేదిక |
---|---|---|
ఫిబ్రవరి 9-13 | 1వ టెస్ట్ | నాగపూర్ |
ఫిబ్రవరి 17-21 | 2వ టెస్ట్ | ఢిల్లీ |
మార్చి 1-5 | 3వ టెస్ట్ | ధర్మశాల |
మార్చి 9-13 | 4వ టెస్టు | అహ్మదాబాద్ |
మార్చి 17 | 1వ వన్డే | ముంబై |
మార్చి 19 | 2వ వన్డే | వైజాగ్ |
మార్చి 22 | 3వ వన్డే | చెన్నై |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..