IND vs AUS 3rd Test: 260 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా గబ్బా టెస్ట్
India vs Australia Highlights, 3rd Test Day 5: ఐదో రోజు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాకు 185 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే, వర్షంతో ప్రస్తుతం మ్యాచ్ ఆగడంతో, డ్రా గా ముగిసే అవకాశాలు పెరిగాయి.
IND vs AUS 3rd Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 260 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఫాలో ఆన్ తప్పించుకుంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆస్గ్రేలియా 185 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. గబ్బా స్టేడియంలో బుధవారం మ్యాచ్ చివరి రోజు భారత్ 252/9 స్కోరుతో ఆట ప్రారంభించింది. ఈరోజు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ జోడీ 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. వీరిద్దరూ 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఆస్ట్రేలియా అహంపై దెబ్బ కొట్టిన టీమిండియా టెయిలెండర్లు.. ఈ మ్యాచ్‌ను డ్రా దిశగా నడింపించేందుకు రెడీ అయ్యారు.
కేఎల్ రాహుల్ 84 పరుగులతోనూ, రవీంద్ర జడేజా 77 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 4 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. శనివారం మొదలైన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలుపొందగా, రెండో టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
5వ రోజు కూడా వర్షం ఆటంకంగా మారే ఛాన్స్..
The waiting game continues for the start of the 2nd innings.
Stay tuned for further updates.
Scorecard – https://t.co/dcdiT9NAoa#TeamIndia | #AUSvIND pic.twitter.com/S0Z8Ysb6gI
— BCCI (@BCCI) December 18, 2024
మ్యాచ్ ఐదో రోజు కూడా వర్షం అంతరాయం కలిగించవచ్చు. వాతావరణ వెబ్‌సైట్ AccuWeather ప్రకారం, డిసెంబర్ 18న బ్రిస్బేన్‌లో 55% వర్షం కురిసే అవకాశం ఉంది. రెండో రోజు మినహా మిగిలిన అన్ని రోజులూ వర్షం ఆటపై ప్రభావం చూపింది.
రెండు జట్ల ప్లేయింగ్-11..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి, ఆకాష్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హేజిల్‌వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..