World Cup 2023: ప్రపంచ కప్‌లో భారత్ తదుపరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో? పూర్తి సమాచారం ఇదిగో..
Team India Next Match in ICC World Cup 2023: ICC ODI ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో రెండో మ్యాచ్ కోసం సిద్ధం అవుతోంది. తొలి మూడు వికెట్లు త్వరగా పడిపోయినా.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జోడీ 150+ భాగస్వామ్యంతో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. దీంతో ఇప్పటి వరకు టీమిండియాకు సమస్యగా మారిన మిడిలార్డర్ సమస్య తీరినట్లేనని అంటున్నారు. ఇంతకీ, టీమిండియా తదుపరి మ్యాచ్ ఎవరితో? ఎప్పుడు, ఎక్కడ? ఆడనుందో ఇప్పుడు తెలుసుకుందాాం.

Team India Next Match in ICC World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత్ అద్భుతంగా ప్రారంభించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేఎల్ రాహుల్ (అజేయంగా 97), విరాట్ కోహ్లీ (85) 165 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.
తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్ సేన.. ఇప్పుడు రెండో మ్యాచ్‌కు సిద్ధం కావాల్సి ఉంది. అయితే, భారత్ తదుపరి టార్గెట్ ఎవరు?, మ్యాచ్ ఎప్పుడు నిర్వహిస్తారు? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచకప్‌లో భారత్‌కి తదుపరి ప్రత్యర్థి ఎవరు?
ప్రపంచకప్‌లో భారత్ తదుపరి మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.




భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
అక్టోబరు 11న (బుధవారం) భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది.
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది.
భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ప్రపంచకప్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మధ్యాహ్నం 2:00 గంటలకు ప్రారంభం కానుంది.
భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
డిస్నీ + హాట్‌స్టార్‌లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే ప్రపంచ కప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు.
ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్ కప్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే ప్రపంచ కప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.
రెండు జట్లు..
టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహమాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫజల్‌హక్, రహ్మాన్‌హక్, రహ్మాన్‌హక్, అబ్దుల్‌హక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




