ODI World Cup 2023: అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్.. టాప్ 5 లిస్ట్ ఇదే.. జాబితాలో భారత్ నుంచి ఒక్కడే.. ఎవరంటే?
ODI World Cup 2023 Most Wickets & Most Runs List: ఇక ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో టాప్ 5 బ్యాటర్లు, బౌలర్లు ఎవరో ఓసారి చూద్దాం.. టాప్-5 జాబితా బ్యాటర్లలో ప్రస్తుతం న్యూజిలాండ్ జోడీ డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర నిలిచారు. టోర్నమెంట్ ఓపెనర్‌లో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను దెబ్బ తీసిన వీరు సెంచరీలతో చెలరేగారు. ఇక బౌలర్ల జాబితాలో నెదర్లాండ్స్‌కు చెందిన బాస్ డి లీడే అగ్రస్థానంలో నిలిచాడు. పాకిస్థాన్‌పై 4/62తో వికెట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ తరపున షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్‌లు మూడు వికెట్లతో సరిపెట్టుకున్నారు.

ODI World Cup 2023 Most Wickets & Most Runs List: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో పది జట్లు పాల్గొన్నాయి. ఇది ఒకే రౌండ్-రాబిన్ గ్రూప్ స్టేజ్ ఫార్మాట్‌లో జరుగుతుంది. తర్వాత సెమీఫైనల్, ఫైనల్. భారతదేశంలోని 10 వేదికలలో 45 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే 5 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. టోర్నీలో ప్రతి జట్టు కనీసం తొమ్మిది మ్యాచ్‌లు, గరిష్టంగా 11 గేమ్‌లు ఆడనుంది.
ఇక ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో టాప్ 5 బ్యాటర్లు, బౌలర్లు ఎవరో ఓసారి చూద్దాం.. టాప్-5 జాబితా బ్యాటర్లలో ప్రస్తుతం న్యూజిలాండ్ జోడీ డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర నిలిచారు. టోర్నమెంట్ ఓపెనర్‌లో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను దెబ్బ తీసిన వీరు సెంచరీలతో చెలరేగారు. అలాగే దక్షిణాఫ్రికా త్రయం రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, క్వింటన్ డి కాక్ సెంచరీలతో ప్రపంచ కప్‌లలో అత్యధిక జట్టు టోటల్‌ను నమోదు చేయడంలో సహాయపడ్డారు. ఈ క్రమంలో మూడు, నాలుగు, ఐదు స్థానాల్లోకి చేరారు.




ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసినవారు:
| ప్లేయర్ | ఇన్నింగ్స్ | పరుగులు | సగటు | స్ట్రైక్ రేట్ | అత్యధికం |
| డెవాన్ కాన్వే (NZ) | 1 | 152 | 152.00 | 125.61 | 152* |
| రచిన్ రవీంద్ర (NZ) | 1 | 123 | 123.00 | 128.12 | 123* |
| రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (SA) | 1 | 108 | 108.00 | 98.18 | 108 |
| ఐడెన్ మార్క్రామ్ (SA) | 1 | 106 | 106.00 | 196.29 | 106 |
| క్వింటన్ డి కాక్ (SA) | 1 | 100 | 100.00 | 119.04 | 100 |
ఇక బౌలర్ల జాబితాలో నెదర్లాండ్స్‌కు చెందిన బాస్ డి లీడే అగ్రస్థానంలో నిలిచాడు. పాకిస్థాన్‌పై 4/62తో వికెట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ తరపున షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్‌లు మూడు వికెట్లతో సరిపెట్టుకున్నారు. భారత్‌కు చెందిన రవీంద్ర జడేజా , ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్‌వుడ్‌లు కూడా తలో మూడు వికెట్లు పడగొట్టి మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు.
ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:
| ఆటగాడు | ఇన్నింగ్స్ | వికెట్లు | సగటు | ఎకానమీ రేటు | బెస్ట్ |
| బాస్ డి లీడే (NED) | 1 | 4 | 15.50 | 6.88 | 4/62 |
| మెహిదీ హసన్ మిరాజ్ (BAN) | 1 | 3 | 8.33 | 2.77 | 3/25 |
| రవీంద్ర జడేజా (IND) | 1 | 3 | 9.33 | 2.80 | 3/28 |
| షకీబ్ అల్ హసన్ (BAN) | 1 | 3 | 10.00 | 3.75 | 3/30 |
| జోష్ హేజిల్‌వుడ్ (AUS) | 1 | 3 | 4.22 | 12.66 | 3/38 |
| హరీస్ రవూఫ్ (PAK) | 1 | 3 | 14.33 | 3.77 | 3/43 |
| మాట్ హెన్రీ (NZ) | 1 | 3 | 16.00 | 4.80 | 3/48 |
| గెర్లాడ్ కోయెట్జీ(SA) | 1 | 3 | 22.66 | 7.55 | 3/68 |
ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




