SA vs IND ODI Series: ముగిసిన T20 సిరీస్.. ఇక వన్డేల్లో భారత్-సౌతాఫ్రికా పోరు.. ఎప్పుడు, ఎక్కడంటే?
South Africa vs India 1st ODI Live Streaming: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య T20I సిరీస్ ముగిసింది. ఇప్పుడు రెండు జట్లు మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌కు సిద్ధమవుతున్నాయి. భారత జట్టుకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్నాడు. అయితే, తొలి వన్డే ఎప్పుడు?, ఎక్కడ నిర్వహిస్తారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య T20 సిరీస్ ముగిసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో ఆఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఇరు జట్లు వన్డే సిరీస్‌కు సన్నద్ధం కావాలి. భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. కాబట్టి, ఇండో-ఆఫ్రికా తొలి వన్డే ఎప్పుడు?, ఎక్కడ? జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్-దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్ ఎప్పుడు?
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి వన్డే మ్యాచ్ డిసెంబర్ 17 ఆదివారం జరగనుంది.
భారత్-దక్షిణాఫ్రికా తొలి వన్డే ఎక్కడ జరుగుతుంది?
జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 1వ వన్డే జరగనుంది.
భారత్-దక్షిణాఫ్రికా తొలి వన్డే ఎక్కడ చూడాలి?
ఇండియా vs సౌత్ ఆఫ్రికా 1వ ODI స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్ మ్యాచ్‌లను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
భారత్-దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి వన్డే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది.
వన్డేలకు రెండు జట్లు..
భారత వన్డే జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్-వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్.
దక్షిణాఫ్రికా వన్డే జట్టు: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్‌మన్, టోనీ డి జోర్జి, నాండ్రే బెర్గర్, రీజా హెండ్రిక్స్, హెన్రిక్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, మిహ్లాలీ మ్పోంగ్వానా, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, టాబ్రిజ్ షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, కైల్ వెరెన్, లిజాడ్ విలియమ్స్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
