- Telugu News Photo Gallery Cricket photos IND Vs SA Team India Bowler Kuldeep Yadav Becomes 1st Bowler To Pick A T20I 5 Wikcet Haul On His Birthday
IND vs SA: పుట్టినరోజున చరిత్ర సృష్టించిన చైనామన్.. యూవీ రికార్డ్ బ్రేక్.. తొలి బౌలర్‌గా..
IND vs SA: తన 29వ పుట్టినరోజున కుల్దీప్ ఐదు వికెట్లు తీయడం ప్రత్యేకమైనది. ఈ స్పెషల్ రికార్డ్‌తో తన పుట్టినరోజు నాడు 3 వికెట్లు తీసిన టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డును కుల్దీప్ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ 2.5 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు అంతర్జాతీయ టీ20లో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత సాధించాడు.
Updated on: Dec 15, 2023 | 10:28 AM

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 106 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో ముగించింది. బ్యాటింగ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్ రాణించగా, బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ 2.5 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాటు అంతర్జాతీయ టీ20లో రెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత సాధించాడు.

భారత్ తరపున అత్యధిక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ రికార్డును సమం చేశాడు.

వీరిద్దరితో పాటు యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్ కూడా భారత్ తరపున టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో కుల్దీప్ డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, కేశవ్ మహరాజ్, నాండ్రే బెర్గర్, లిజాద్ విలియమ్స్ వికెట్లు తీశాడు.

ముఖ్యంగా 29వ పుట్టినరోజున కుల్దీప్ ఐదు వికెట్లు తీయడం విశేషం. దీంతో తన పుట్టినరోజు నాడు 3 వికెట్లు తీసిన టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డును కుల్దీప్ బద్దలు కొట్టాడు.

అతని పుట్టినరోజున అంటే డిసెంబర్ 12, 2009, మొహాలీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ 23 పరుగులు చేసి మూడు వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా నిలిచింది.

భారత్ తరపున ఇప్పటివరకు 34 టీ20 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ 6.68 ఎకానమీతో 58 వికెట్లు పడగొట్టాడు.





























