IND vs SA: పేస్ దెబ్బకు కుప్పకూలిన భారత టాప్ ఆర్డర్.. సూర్య హాఫ్ సెంచరీ.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
దక్షిణాఫ్రికాపై మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం పెద్దగా ప్రయోజనకరంగా కనిపించ లేదు. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా ముందు 134 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
దక్షిణాఫ్రికాపై మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం పెద్దగా ప్రయోజనకరంగా కనిపించ లేదు. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా ముందు 134 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సూర్య 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రోహిత్ 15, కోహ్లీ 12 పరుగులు చేయగా, మిగతా బ్యాటర్స్ సింగ్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత్ టాప్ ఆర్డర్ సౌతాఫ్రికా పేస్ దెబ్బకు ఘోరంగా విఫలమైంది. భారత్ 8 ఓవర్లలో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయింది. తబ్రేజ్ షమ్సీ స్థానంలో వచ్చిన లుంగీ ఎన్‌గిడి 4 వికెట్లు పడగొట్టి, టీమిండియాకు భారీ షాక్ ఇచ్చాడు. అనంతరం సూర్యకుమార్, దినేష్ కార్తీక్ 50 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా ఓమోస్తారు స్కోర్ చేసింది. ఈ క్రమంలో సూర్య 30 బంతుల్లో T20లో తన 11వ అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ సమయంలో అతని బ్యాట్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు వచ్చాయి.
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్..
టోర్నీలో భారత్‌కి ఇది మూడో మ్యాచ్ కాగా, మూడు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ టాస్ గెలిచాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అతను 36 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాడు. అతని తర్వాత శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్ (35 మ్యాచ్‌లు) ఉన్నాడు.
FIFTY for @surya_14kumar! ? ?
2⃣nd half-century in a row! ? ?
Follow the match ▶️ https://t.co/KBtNIjPFZ6 #TeamIndia | #T20WorldCup | #INDvSA pic.twitter.com/OIuP2H2l9A
— BCCI (@BCCI) October 30, 2022
ఇరు జట్లు..
భారత ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: క్వింటన్ డి కాక్(w), టెంబా బావుమా(సి), రిలీ రోసోవ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి న్గిడి, అన్రిచ్ నోర్ట్జే