AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Ireland : తొలి టీ20లో షాక్.. రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలుపు బాట పట్టేనా?

India vs Ireland : ఐర్లాండ్ చేతిలో తొలి టీ20లో షాకింగ్ ఓటమి చవిచూసిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్లో మార్పులు లేకపోయినా.. బౌలింగు లో రెండు మార్పులతో బరిలోకి దిగనుంది టీమిండియా.

India vs Ireland : తొలి టీ20లో షాక్.. రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలుపు బాట పట్టేనా?
Vaibhav Sooryavanshi
Rakesh
|

Updated on: Jun 28, 2026 | 7:17 AM

Share

India vs Ireland : బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. పసికూనగా భావించిన ఐర్లాండ్ జట్టు, భారత జట్టుకు గట్టి పోటీనివ్వడమే కాకుండా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక, 148 పరుగులకే భారత బ్యాటర్లు చతికిలబడటం అభిమానులను నిరాశపరిచింది. అయితే, ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న టీమిండియా, రెండో టీ20లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.

మొదటి టీ20లో టీమిండియా వైఫల్యం

మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు కఠినమైన సవాలును విసిరింది. 183 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టింది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ తడబడటంతో 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముఖ్యంగా కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణమైంది. ఐర్లాండ్ జట్టులో రాజస్థాన్‌కు చెందిన జయ్ మూంద్రా అద్భుతమైన బౌలింగ్‌తో భారత బ్యాటర్లను కట్టడి చేశాడు.

రెండో టీ20లో జట్టు మార్పులు?

ఒక ఓటమి తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసే అవకాశం తక్కువని తెలుస్తోంది. అయితే, బౌలింగ్ విభాగంలో మాత్రం మార్పులు తప్పనిసరి అనిపిస్తున్నాయి. ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇది జట్టుకు మరిన్ని ఆప్షన్లను ఇస్తుంది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కడం అనుమానమే.

ఆత్మవిశ్వాసంతో ఐర్లాండ్

భారత్‌పై సాధించిన తొలి విజయంతో ఐర్లాండ్ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా అదే విజయవంతమైన జట్టుతో బరిలోకి దిగాలని ఐరిష్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కీలక ఆటగాళ్లు లేకపోయినా, యువతతో కూడిన ఈ జట్టు భారత్‌కు మళ్లీ కష్టాలు తప్పవని హెచ్చరిస్తోంది.

రెండో టీ20కి అంచనా జట్లు

భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్/ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

ఐర్లాండ్ జట్టు: టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టకర్ (కెప్టెన్/వికెట్ కీపర్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలనీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెకార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జయ్ మూంద్రా.

మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us