IND vs ZIM: అరంగేట్రానికి సిద్ధమైన మరో యంగ్ ప్లేయర్.. జింబాబ్వేతో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ XI ఎలా ఉండనుందంటే?
India Playing XI vs ZIM: భారత జట్టు ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
జింబాబ్వేతో ఆగస్టు 18 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కేఎల్ రాహుల్ చాలా కాలం తర్వాత ఈ సిరీస్ ద్వారా మళ్లీ క్రికెట్ మైదానంలోకి వస్తున్నాడు. చాలా కాలం తర్వాత తిరిగి జట్టులోకి వస్తున్న కేఎల్ రాహుల్.. కెప్టెన్సీలో తొలి విజయం కోసం తెగ ఆరాటపడుతున్నాడు. జింబాబ్వే టూర్‌లో అతను జట్టు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రాహుల్ త్రిపాఠి కూడా ఈ మ్యాచ్‌లో భారత్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
రాహుల్ త్రిపాఠి అరంగేట్రం చేసే ఛాన్స్..
హరారేలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో జింబాబ్వేతో భారత్ తరపున రాహుల్ త్రిపాఠి తన వన్డే అరంగేట్రం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. త్రిపాఠితో పాటు టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా చాలా కాలం తర్వాత తిరిగి జట్టులోకి వస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్‌లో కనిపించనున్నాడు. అదే సమయంలో శుభ్‌మన్ గిల్ మిడిల్ ఆర్డర్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది.
షాబాజ్ అహ్మద్ కూడా..
జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్ కోసం వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను టీమ్‌లో చేర్చుకుంది. గాయం కారణంగా సుందర్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. షహబాజ్ దేశవాళీ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించాడు. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగంగా ఉన్నాడు. తొలిసారి భారత జట్టులోకి వచ్చాడు.
టీమిండియా అంచనా..
టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్: కేఎల్ రాహుల్ (కెప్టెన్) , శిఖర్ ధావన్, రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్ / ఇషాన్ కిషన్ (కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.