Watch Video: 5 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో దూకుడు.. కట్ చేస్తే.. ఈ ఏడాది అత్యంత స్పీడ్ బాల్‌కు డకౌట్.. వైరల్ వీడియో..

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య లండన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు.

Watch Video: 5 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో దూకుడు.. కట్ చేస్తే.. ఈ ఏడాది అత్యంత స్పీడ్ బాల్‌కు డకౌట్.. వైరల్ వీడియో..
Eng Vs Sa Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Aug 18, 2022 | 9:17 AM

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే తన ఫాస్ట్, పేస్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. ఐపీఎల్‌ అయినా, అంతర్జాతీయ కెరీర్‌ అయినా బ్యాట్స్‌మెన్‌లను భయపెడుతుంటాడు. తాజాగా మరోసారి తన అద్భుతమైన బౌలింగ్‌తో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లు కూడా ఈ సౌతాఫ్రికా బౌలర్‌ను ఎదుర్కొనలేకపోయారు. అన్రిచ్ నోర్ట్జే వేసిన ఓ సూపర్ బంతికి ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎలా ఔటయ్యాడో తెలియక షాకవుతూ పెవిలియన్ దారి పట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది.

సౌతాఫ్రికా దెబ్బకు చెల్లాచెదురైన ఇంగ్లండ్ జట్టు..

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య లండన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 32 ఓవర్లు మాత్రమే ఆడగా ఇంగ్లండ్ ఆరు వికెట్లకు 116 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్‌కు ఫాస్ట్ బౌలర్ కగిసో రబడ ఆరంభంలోనే బ్యాట్‌మెన్స్‌కు షాకులు ఇచ్చాడు. రబాడ వచ్చిన వెంటనే రెండు వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టో వికెట్ ఇంగ్లండ్ జట్టుకు చాలా ముఖ్యమైనది. అయితే అన్రిచ్ నోర్ట్జే మాత్రం తన స్టైల్లో బెయిర్‌స్టోను ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేర్చాడు.

అన్రిచ్ నోర్ట్జే వేగానికి బెయిర్‌స్టో బలయ్యాడు..

16వ ఓవర్ వేసిన అన్రిచ్ నోర్ట్జే.. ఆ సమయానికి ఇంగ్లండ్ 42 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. అన్రిచ్ నోర్ట్జే వేసిన బంతి యార్కర్ కాదు. అయితే, స్పీడ్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమైన బెయిర్‌స్టో.. మిడిల్ స్టంప్‌ను బంతి తాకడంతో పెవిలియన్ చేరాడు. బంతి తగిలిన వెంటనే స్టంప్ గాలిలోకి ఎగిరింది. ఐదు బంతులు ఆడినా ఖాతా తెరవలేకపోయాడు. ఇక్కడి నుంచి ఇంగ్లండ్ జట్టు కష్టాలు పెరిగాయి. అన్రిచ్ నోర్ట్జే 43 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, రబడ 36 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బెన్ ఫాక్స్‌ను కూడా అన్రిచ్ నోర్ట్జే బౌల్డ్ చేశాడు.

View this post on Instagram

A post shared by Spark Sport (@sparknzsport)

తొలి రోజు ఇంగ్లండ్ పరిస్థితి దారుణం..

అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడా బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా టీం తొలిరోజు సత్తా చాటింది. ఓలీ పోప్ ఒక ఎండ్‌లో 61 పరుగులతో ఆడుతున్నాడు. కానీ, అతనికి మరో ఎండ్ నుంచి ఎలాంటి సహాయం అందడంలేదు. ఆట ముగిసే సమయానికి ఖతా తెరవకుండా స్టువర్ట్ బ్రాడ్ క్రీజులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. రబడ వెంటనే ఓపెనర్లు అలెక్స్ లీజ్ (5), జాక్ క్రౌలీ (9) ఇద్దరినీ పెవిలియన్ చేర్చి, భారీ షాక్ ఇచ్చాడు.

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..