AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI : ఢిల్లీ టెస్ట్‌లో విండీస్‌కు చుక్కలు చూపించిన టీమిండియా.. డబుల్ సెంచరీకి చేరువలో యంగ్ సెన్సేషన్

భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా మొదటి రోజే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, ఆట ముగిసే సమయానికి కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 318 పరుగుల భారీ స్కోరు సాధించింది.

IND vs WI : ఢిల్లీ టెస్ట్‌లో విండీస్‌కు చుక్కలు చూపించిన టీమిండియా.. డబుల్ సెంచరీకి చేరువలో యంగ్ సెన్సేషన్
Yashasvi Jaiswal (2)
Rakesh
|

Updated on: Oct 10, 2025 | 7:14 PM

Share

IND vs WI : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 2 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది. ముఖ్యంగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. సెంచరీతో పాటు 150 పరుగుల మార్కును కూడా దాటిన జైస్వాల్, డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.

ఢిల్లీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు పటిష్టమైన స్థితిలో ఉంది. టీమిండియా 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. ఈ రోజు ఆటలో మెయిన్ హీరో యశస్వి జైస్వాల్ అనే చెప్పాలి. స్టంప్స్ సమయానికి జైస్వాల్ 173 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో ఐదోసారి 150 పరుగుల మార్కును దాటడం విశేషం. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 20 పరుగులతో జైస్వాల్‌కు తోడుగా ఉన్నాడు.

అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ ఈసారి కేవలం 38 పరుగులు చేసి అవుటయ్యాడు. రాహుల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్, జైస్వాల్‌తో కలిసి వెస్టిండీస్ బౌలర్లను బాగా అలసిపోయేలా చేశాడు. ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు ఏకంగా 193 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. సుదర్శన్ తన టెస్ట్ కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా 87 పరుగులు చేసి, సెంచరీకి కొద్ది దూరంలో అవుటయ్యాడు. భారత్ జట్టు 251 పరుగుల వద్ద సుదర్శన్ రూపంలో రెండో వికెట్‌ను కోల్పోయింది. సుదర్శన్‌ను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వారికన్ క్లీన్ బౌలింగ్‌తో బోల్తా కొట్టించాడు.

యశస్వి జైస్వాల్ తన టెస్ట్ కెరీర్‌లో ఇది ఐదోసారి 150 పరుగుల మార్కు దాటడం ద్వారా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు గనుక అతను డబుల్ సెంచరీ (200 పరుగులు) సాధిస్తే, అది అతని కెరీర్‌లో మూడో డబుల్ సెంచరీ అవుతుంది. అంతేకాకుండా, ఏదైనా ఒక టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజునే 150 పరుగుల మార్కును అందుకోవడం జైస్వాల్‌కి ఇది రెండోసారి. దీనికి ముందు అతను 2024లో ఇంగ్లాండ్‌పై విశాఖపట్నం టెస్టులో మొదటి రోజు 179 పరుగులు సాధించాడు. వెస్టిండీస్ బౌలర్లు ఈ రోజు మొత్తం జోమెల్ వారికన్ తీసిన రెండు వికెట్లకే పరిమితమై, మిగతా సమయంలో భారత బ్యాటర్లను అడ్డుకోలేకపోయారు.

మొదటి రోజు ఆటలో మూడు సెషన్లలో టీమిండియా ప్రదర్శన విషయానికి వస్తే.. మొదటి సెషన్లో కేఎల్ రాహుల్ రూపంలో ఒక వికెట్ కోల్పోయి 94 పరుగులు సాధించింది. రెండవ సెషన్లో భారత జట్టు ఎలాంటి వికెట్ కోల్పోకుండా మొత్తం 126 పరుగులు చేసింది. మూడవ సెషన్‌లో 98 పరుగులు వచ్చాయి. అయితే, సాయి సుదర్శన్ వికెట్‌ను భారత్ కోల్పోయింది. జైస్వాల్, గిల్ జోడి 67 పరుగుల భాగస్వామ్యంతో రోజును ముగించింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..