IND vs WI 2nd T20I: రెండో పోరుకు సిద్ధమైన భారత్, వెస్టిండీస్ టీంలు.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
IND vs WI 2nd T20: వెస్టిండీస్ మొదటి T20 మ్యాచ్‌లో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఇదే క్రమంలో నేడు జరిగే రెండో టీ20లోనూ గెలిచి సిరీస్‌లో దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. మరోవైపు రెండో వన్డేలో గెలిచి, సిరీస్‌ను సమయం చేయాలని హార్దిక్ సారత్యంలోని భారత్ కోరుకుంటోంది. భారత్-వెస్టిండీస్ మధ్య జరగనున్న రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ సాయంత్రం 7.30 గంటలకు జరగనుంది. అలాగే రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్‌కు సంబంధించి కొన్ని విషయానలు ఇప్పుడు తెలుసుకుందాం..
India vs West Indies 2nd T20: భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రేపు (ఆగస్టు 6) రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ట్రినిడాడ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇప్పుడు రెండో మ్యాచ్‌లో గెలిచి వెస్టిండీస్‌పై హార్దిక్ పాండ్యా జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం..
భారత్-వెస్టిండీస్ మధ్య జరగనున్న రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ సాయంత్రం 7.30 గంటలకు జరగనుంది. అలాగే రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది.
మ్యాచ్ ఎక్కడ జరుగనుంది?
గయానా ప్రావిడెన్స్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2019లో టీమిండియా ఆడిన ఏకైక మ్యాచ్‌లో విజయం సాధించింది. కాబట్టి ఈసారి కూడా విజయాన్ని ఆశిస్తోంది.
ఏ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం?
ఈ మ్యాచ్‌ను భారతదేశంలోని DD స్పోర్ట్స్ ఛానెల్‌లో వీక్షించవచ్చు.
ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి?
ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. మీరు జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో కూడా ఈ మ్యాచ్‌ను ఉచితంగా చూడొచ్చు.
📸 Dr K. J. Srinivasa – High Commissioner of India – hosted #TeamIndia at the Indian High Commission in Guyana ahead of the second T20I. #WIvIND pic.twitter.com/iDFrrNJg4w
— BCCI (@BCCI) August 5, 2023
భారత టీ20 జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
వెస్టిండీస్ టీ20 జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకీల్ హొస్సేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్‌కాయ్, నికోలస్ పూరన్ షెపర్డ్, ఓడియన్ స్మిత్, ఒషానే థామస్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..