IND vs SA 1st ODI: 23 నెలల వైట్ వాష్ ప్రతీకారం తీర్చుకునేనా.. సౌతాఫ్రికాతో తొలి వన్డేకి సిద్ధమైన రాహుల్ సేన..
IND vs SA 1st ODI Probable Playing 11: దాదాపు 23 నెలల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ తొలిసారిగా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఆ సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు యువ జట్టుతో రంగంలోకి దిగుతున్న రాహుల్ మొన్నటి సిరీస్ ఓటమిపై రివేంజ్ ఎలా తీర్చుకుంటాడో చూడాలి.

India vs South Africa Probable Playing 11: టీ20 సిరీస్ ముగిసిన తర్వాత, ఇప్పుడు భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య వన్ డే సిరీస్ మొదలైంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్ ఆదివారం, డిసెంబర్ 17న జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ (New Wanderers in Johannesburg)లో జరగనుంది. ఈ సిరీస్‌లో టీమ్ ఇండియా నాయకత్వంతోపాటు జట్టులోనూ కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టీ20 సిరీస్‌లో జట్టుకు నాయకత్వం వహించిన సూర్యకుమార్ యాదవ్ వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదు. తద్వారా ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. యువ ఆటగాళ్లు మాత్రమే ఉన్న జట్టులో రాహుల్ (KL Rahul) తొలి మ్యాచ్‌లో ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగనున్నాడో చూడాలి.
దాదాపు 23 నెలల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ తొలిసారిగా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఆ సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు యువ జట్టుతో రంగంలోకి దిగుతున్న రాహుల్ మొన్నటి సిరీస్ ఓటమిపై రివేంజ్ ఎలా తీర్చుకుంటాడో చూడాలి. చూడాలి.
జట్టులో ఎవరికి అనుమతి ఉంది?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు వన్డే సిరీస్‌లో ఆడడం లేదు. కాబట్టి, బలమైన సౌతాఫ్రికాపై సిరీస్ గెలవడం రాహుల్‌కు సవాల్‌గా మారనుంది. మ్యాచ్‌కు ఒకరోజు ముందు రాహుల్ కూడా ఈ విషయాన్ని సూచించాడు.
వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు సిరీస్‌లో అవకాశం లభిస్తుందని, అతను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడని రాహుల్ డిసెంబర్ 16, శనివారం విలేకరుల సమావేశంలో తెలిపాడు. అయితే వికెట్ కీపింగ్ బాధ్యత కూడా తానే తీసుకుంటానని రాహుల్ స్పష్టం చేశారు. ఈ సిరీస్‌లో రింకూ సింగ్‌కు కూడా అవకాశం వస్తుందని రాహుల్ ప్రకటించాడు. అయితే, తొలి మ్యాచ్‌లో అతడిని ఎంపిక చేసే అవకాశం లేదు. కాబట్టి రాహుల్ ఏ ఆటగాళ్లతో ఆడనున్నాడో చూడాలి.
ఓపెనింగ్, స్పిన్ విభాగంలో గందరగోళం..
జట్టులో ఓపెనింగ్ జోడిపై పెద్ద ప్రశ్న తలెత్తింది. రుతురాజ్ గైక్వాడ్ ఆడటం ఖాయం. కానీ అతనితో ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్‌లో ఆడతానని రాహుల్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ సందర్భంలో యువ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం దక్కడం ఖాయం. తిలక్ వర్మ మూడో స్థానంలో ఆడవచ్చు. శ్రేయాస్ అయ్యర్, రాహుల్, శాంసన్ వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు.
బౌలింగ్ విషయానికొస్తే, యుజ్వేంద్ర చాహల్ వన్డే జట్టుకు తిరిగి రావడం ఖాయం. అక్షర్ పటేల్ రెండవ స్పిన్నర్ కావచ్చు. టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్‌కు తొలి మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. మిగతా చోట్ల, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్‌లు ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కనిపించవచ్చు.
తొలి వన్డేలో భారత జట్టు ప్రాబబుల్ ప్లేయింగ్ 11..
కేఎల్ రాహుల్ (కెప్టెన్-వికెట్ కీపర్), సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
