IND vs NZ: ముంబై టెస్టులో జడ్డూ జోరు.. దెబ్బకు జహీరో, ఇషాంత్ రికార్డులు బద్దలు

ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య చివరిదైన మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు చేయకుండా ఇండియా బౌలర్లు కట్టడి చేస్తున్నారు.

IND vs NZ: ముంబై టెస్టులో జడ్డూ జోరు.. దెబ్బకు జహీరో, ఇషాంత్ రికార్డులు బద్దలు
Ravindra Jadeja
Follow us
Basha Shek

|

Updated on: Nov 01, 2024 | 2:52 PM

ముంబై టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు శుభారంభం లభించింది. ఓపెనిర్దు ఇద్దరూ నిలకడగా పరుగులు సాధించారు. అయితే ఆకాశ్ దీప్ మొదటి వికెట్ తీసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే డారెల్ మిచెల్, విల్ యంగ్ ఇద్దరూ భారత బౌలర్లకు విసుగు తెప్పించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను ఆదుకునేందుకు భారీ భాగస్వామ్యం నెలకొల్పేందుకు ప్రయత్నించారు. అయితే రవీంద్ర జడేజా ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ జోరుకు అడ్డుకట్ట వేశాడు. ఆ తర్వాత జడేజా కొన్ని ఓవర్లలోనే మూడో వికెట్ తీసి జహీర్ ఖాన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 45వ ఓవర్లో రవీంద్ర జడేజా 2 వికెట్లు సాధించాడు. విల్ యంగ్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. యంగ్ 138 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. ఆ తర్వాత మూడో బంతికి టామ్ బ్లండెల్‌ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 44.5 ఓవర్లలో 159 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది.

జడేజా 8 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌నుమరో దెబ్బ (52.6) కొట్టాడు. 17 బంతుల్లో గ్లెన్ ఫిలిప్స్‌ను బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపించాడు.. దీంతో న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఈ మూడో వికెట్‌తో టీమిండియా తరఫున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా జడేజా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో జడేజా సాధించిన మూడో వికెట్ అతని టెస్టు కెరీర్‌లో 312వ వికెట్. జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మల జోడీని కూడా జడేజా అధిగమించాడు. జడేజాతో పాటు, అతను ఐదవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అలాగే ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లలో రెండో వాడు.

టీమిండియా తరఫున అత్యధిక టెస్టు వికెట్లు

  • అనిల్ కుంబ్లే – 619
  • ఆర్ అశ్విన్ – 533
  • కపిల్ దేవ్ – 434
  • హర్భజన్ సింగ్ – 418
  • రవీంద్ర జడేజా – 312*
  • జహీర్ ఖాన్ – 311
  • ఇషాంత్ శర్మ – 311
ఇవి కూడా చదవండి

కాగా ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 204 పరుగులుగా ఉంది.

టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్:

టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, ఎజాజ్ పటేల్, విలియం ఓ’రూర్క్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..