IPL 2025: ‘అలాంటివాళ్లనే జట్టులోకి తీసుకుంటాం’.. కేఎల్ రాహుల్‌ను మళ్లీ దారుణంగా అవమానించిన లక్నో ఛైర్మన్

IPL 2025 మెగా వేలానికి ముందు KL రాహుల్‌ని లక్నో సూపర్‌జెయింట్స్ తొలగించింది. అలాగే 5 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ రిటైనింగ్ ప్రక్రియ తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఇవి కేఎల్ రాహుల్‌ను అవమానించేలా ఉన్నాయంటూ క్రికెట్ అభిమానులు సంజీవ్ గోయెంకాపై మండి పడుతున్నారు

IPL 2025: 'అలాంటివాళ్లనే జట్టులోకి తీసుకుంటాం'.. కేఎల్ రాహుల్‌ను మళ్లీ దారుణంగా అవమానించిన లక్నో ఛైర్మన్
KL Rahul, Sanjiv Goenka
Follow us
Basha Shek

|

Updated on: Nov 01, 2024 | 3:26 PM

IPL 2025 మెగా వేలానికి ముందు, అన్ని జట్లు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల పేర్లను ప్రకటించాయి. దీని ప్రకారం, లక్నో సూపర్ జెయింట్ ఫ్రాంచైజీ మెగా వేలానికి ముందు మొత్తం 5 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. ఇందులో ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్‌లు మరియు ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు ఉన్నారు. కానీ ఈ జాబితాలో ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పేరు లేదు. అంటే రాహుల్ లక్నో జట్టుకు దూరమైనట్టే. అతను ఇక మెగా వేలంలో కనిపించనున్నాడు. కాగా, రాహుల్‌ను జట్టు నుంచి తప్పించిన లక్నో యజమాని ఆ తర్వాత అతని పేరు ప్రస్తావించకుండా సంచలన కామెంట్స్ చేశాడు. నిజానికి గత మూడు ఎడిషన్లలో కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ వ్యవధిలో లక్నో రెండుసార్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. అయితే రెండుసార్లు టైటిల్ గెలవలేకపోయింది. అయితే గత సీజన్‌లో జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఏడింటిలో ఓడి 7వ స్థానంలో నిలిచింది. దీంతో జట్టు కెప్టెన్ రాహుల్‌ను జట్టు నుంచి తప్పించాలని జట్టు యజమాని సంజీవ్ గోయెంకా నిర్ణయించారు.

రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసిన అనంతరం సంజీవ్ మాట్లాడుతూ.. రాహుల్ పేరును డైరెక్టుగా ప్రస్తావించకుండా అతనిని అవమానించాడు. అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్న సంజీవ్.. ‘ గెలవాలనే కసి, జట్టును గెలిపించాలనే మనస్తత్వం ఉన్న ఆటగాళ్లను నా జట్టులో ఉంచుకోవాలనుకుంటున్నాను. జట్టు కోసం ఆడుకోకుండా, వారి స్వంత ప్రయోజనాలు, వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడే ఆటగాళ్లు మాకు అక్కర్లేదు’ అని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కేఎల్ రాహుల్‌ను అవమానించేలా సంజీవ్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడు కూడా..

ఐపీఎల్ చివరి సీజన్‌లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడిపోవడంతో ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా, కేఎల్ రాహుల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మైదానంలో రాహుల్‌ను గోయెంకా మందలించారు. అయితే ఆ తర్వాత ఇద్దరూ కలిసి కనిపించారు. అయితే ఈసారి కేఎల్ రాహుల్‌ను రిటైన్ చేసేందుకు జట్టు యాజమాన్యం, మేనేజ్‌మెంట్ మొగ్గు చూపలేదు. మరోవైపు రాహుల్ స్వయంగా జట్టులో కొనసాగేందుకు నిరాకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

లక్నో రిటైన్ ఆటగాళ్లు వీరే..

లక్నో సూపర్‌జెయింట్స్‌ నికోలస్‌ పురాన్‌ను రూ. 21 కోట్లకు, రవి బిష్ణోయ్‌, మయాంక్‌ యాదవ్‌లను రూ. 11 కోట్లకు తమ ఖాతాలో వేసుకున్నారు. వీరితో పాటు ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోనీలను రూ.4 కోట్లకు అట్టిపెట్టుకున్నారు. ఇక కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా, నవీన్ ఉల్ హక్ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లను లక్నో వేలంలోకి వదిలేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..