Video: గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. దెబ్బకు సెంచరీ హీరో కాస్తా తోకముడుచుకున్నాడుగా..

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, ఇబ్బందుల్లో పడ్డాడు. గురువారం రెండో రోజు. లంచ్ సమయానికి టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 34 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

Video: గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్.. దెబ్బకు సెంచరీ హీరో కాస్తా తోకముడుచుకున్నాడుగా..
Devon Conway Onehanded Catch
Follow us

|

Updated on: Oct 17, 2024 | 12:20 PM

Devon Conway Unbelievable Sarfaraz Khan Catch: బెంగళూరులో భారత్ -న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే మైదానంలో తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కాన్వే, మిడ్-ఆఫ్‌లో నిలబడి, గాలిలో ఎగురుతూ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కళ్ల చెదిరే క్యాచ్ చూసి సర్ఫరాజ్ ఖాన్ కూడా షాక్ అయ్యాడు. తలవంచుకుని ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు ఈ యువ ప్లేయర్.

ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్..

కేవలం 9 పరుగుల స్కోరు వద్ద రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వికెట్లు పడటంతో క్లిష్ట పరిస్థితుల్లో సర్ఫరాజ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే తన మూడో బంతికి దూకుడు షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ కోల్పోయాడు. సర్ఫరాజ్ ఒక అడుగు ముందుకు వేసి మిడ్-ఆఫ్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి అతను ఆశించిన ఎత్తులో వెళ్లలేదు.

డెవాన్ కాన్వే తన కుడివైపు ఫుల్ స్ట్రెచ్ డైవ్ చేశాడు. క్యాచ్‌ను ఒక చేతితో పూర్తి చేసి, షాకిచ్చాడు. అతను తన పిడికిలిలో బంతిని బంధించిన సమయంలో అతను పూర్తిగా గాలిలో ఉన్నాడు. ఈ క్యాచ్ పూర్తయిన వెంటనే, సోషల్ మీడియాలో కాన్వేపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

న్యూజిలాండ్‌కు శుభారంభం..

వర్షం కారణంగా తొలిరోజు రద్దయిన తర్వాత రెండో రోజు ఆట సమయానికి ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇది ఇప్పటివరకు కష్టమని తేలింది. 12.4 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. అయితే, అప్పటికి భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇన్ని ఓవర్లు ఆడినప్పటికీ భారత్ స్కోరు 13 పరుగులు మాత్రమే. ఇద్దరు సీనియర్ బ్యాట్స్‌మెన్‌తో పాటు సర్ఫరాజ్ వికెట్ పడటంతో భారత జట్టు కష్టాల్లో కూరుకపోయింది.

వర్షం తర్వాత ప్రారంభమైన మ్యాచ్..

వర్షం ఆగిపోవడంతో మరలా మ్యాచ్ మొదలైంది. ఈ క్రమంలో భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ ఒత్తిడితో కూరుకపోయింది. వార్త రాసే సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. జైస్వాల్ 13, రోహిత్ 2 పరుగులు చేయగా, విరాట్, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, జడేజా జీరోకే పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..