AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: సాగర తీరంలో ఇండియా, ఇంగ్లండ్ రెండో టెస్ట్‌.. వైజాగ్‌లో మన రికార్డులు ఏం చెబుతున్నాయంటే?

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పుడు విశాఖపట్నం వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు త్వరలో అక్కడికి వెళ్లనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టుకు ఈ మ్యాచ్ మరింత కీలకం కానుంది.

IND vs ENG: సాగర తీరంలో ఇండియా, ఇంగ్లండ్ రెండో టెస్ట్‌.. వైజాగ్‌లో మన రికార్డులు ఏం చెబుతున్నాయంటే?
Team India
Basha Shek
|

Updated on: Jan 30, 2024 | 6:46 AM

Share

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇప్పుడు విశాఖపట్నం వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు త్వరలో అక్కడికి వెళ్లనున్నాయి. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టుకు ఈ మ్యాచ్ మరింత కీలకం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ర్యాకింగ్స్‌ లో మరింత కిందకు దిగజారడమే ఇందుకు ప్రధాన కారణం. ఇదిలా ఉంటే, తర్వాతి మ్యాచ్‌కి ముందు, విశాఖపట్నంలో భారత్ ఇప్పటివరకు ఎన్ని టెస్టులు ఆడింది, ఎన్ని మ్యాచ్‌లు గెలిచింది తదితర వివరాలు తెలుసుకుందాం రండి. విశాఖలో టీమిండియా ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. 2016లో ఇంగ్లండ్‌తో భారత్ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా సెంచరీలతో చెలరేగారు. అయితే కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా రానున్న మ్యాచ్‌లో ఆడకపోవడం రోహిత్‌ సేనకు ఎదురుదెబ్బ లాంటిదే. దీని తర్వాత, 2019లో దక్షిణాఫ్రికాతో భారత్ ఇక్కడ రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ 203 పరుగుల తేడాతో విజయం సాధించింది.

హైదరాబాద్‌లో తొలిసారిగా ఓడిపోయిన భారత్, గతంలో జరిగిన అన్ని టెస్టుల్లోనూ విజయం సాధించింది. విశేషమేమిటంటే.. తొలి టెస్టులో తొలి రెండు రోజుల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించినా.. ఓలీ పోప్ ఇన్నింగ్స్ మాత్రం అన్నింటినీ మార్చేసింది. తొలి టెస్టుకు ముందు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు ఓటమితో నేరుగా 5వ స్థానానికి పడిపోయింది. అయితే తర్వాతి మ్యాచ్‌లో గెలిచిన వెంటనే టీమ్ ఇండియా కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందుతుంది. ఇదిలా ఉంటే స్వదేశంలో గత మూడు టెస్టు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేకపోయింది. అంతకుముందు, భారత్ ఆస్ట్రేలియాతో స్వదేశంలో సిరీస్ ఆడింది, ఇందులో భారత జట్టు గత రెండు మ్యాచ్‌లలో ఒకదానిలో ఓడిపోయి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..