IND vs ENG 1st ODI: టీమిండియాకు భారీ షాక్.. తొలి వన్డే నుంచి విరాట్ కోహ్లీ ఔట్?
కోహ్లికి ఈ గాయం ఏ సమయంలో తగిలిందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. నివేదిక ప్రకారం, గత మ్యాచ్‌లో విరాట్ గజ్జల్లో గాయంతో బాధపడ్డాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
మంగళవారం నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు కష్టాలు మొదలయ్యాయి. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి గాయపడటంతో తొలి మ్యాచ్‌లో ఆడడం కష్టంగా మారింది. వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం, విరాట్ కోహ్లి భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడవ T20 మ్యాచ్‌లో గజ్జల్లో గాయంతో బాధపడ్డాడు. దాని కారణంగా అతను మొదటి వన్డేలో ఆడటం కష్టంగా మారింది. మూడో T20 మ్యాచ్ జులై 10 ఆదివారం నాటింగ్‌హామ్‌లో జరిగిన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్ జులై 12 మంగళవారం నుంచి లండన్‌లోని ఓవల్‌లో మొదలవుతుంది.
కోహ్లి గాయానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. గాయం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా తెలియలేదు. అయినప్పటికీ, భారత జట్టు మేనేజ్‌మెంట్ కోహ్లీకి మొదటి మ్యాచ్‌లో విరామం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తద్వారా అతను తదుపరి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. సిరీస్‌లో రెండో మ్యాచ్ జులై 14న లార్డ్స్‌లో జరగనుండగా, మూడో మ్యాచ్ జులై 17న మాంచెస్టర్‌లో జరగనుంది.
కోహ్లికి ఈ గాయం ఏ సమయంలో తగిలిందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. నివేదిక ప్రకారం, గత మ్యాచ్‌లో విరాట్ గజ్జల్లో గాయంతో బాధపడ్డాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇది బ్యాటింగ్ సమయంలో జరిగిందా లేదా ఫీల్డింగ్ సమయంలో జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదు.