IND vs ENG 3rd Test 1st Day: రాజ్‌కోట్‌లో తొలిరోజు భారత్ అదరహో.. రోహిత్, జడేజా సెంచరీలు, సర్ఫరాజ్ తుఫాన్ ఇన్నింగ్స్..
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరుగుతోంది. నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 110 పరుగులతో, కుల్దీప్ యాదవ్ 1 పరుగుతో నాటౌట్‌గా ఉన్నారు.

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ రాజ్‌కోట్ వేదికగా జరుగుతోంది. నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 110 పరుగులతో, కుల్దీప్ యాదవ్ 1 పరుగుతో నాటౌట్‌గా ఉన్నారు.
తొలి రోజు భారత్ తరపున రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలు సాధించారు. తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు తీయగా, టామ్ హార్ట్లీ ఒక వికెట్ తీశారు. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ భారత్ తరపున అరంగేట్రం చేశారు.
జడేజా టెస్టులో 3000 పరుగులు..
టెస్టు క్రికెట్‌లో రవీంద్ర జడేజా 3 వేల పరుగులు పూర్తి చేశాడు. 70 మ్యాచ్‌ల్లో 102 ఇన్నింగ్స్‌ల్లో 3 వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ సమయంలో అతను 20 అర్ధ సెంచరీలు, 4 సెంచరీలు చేశాడు.
సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ..
టీమ్ ఇండియా తరపున అరంగేట్రం టెస్టు ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అతను టామ్ హార్ట్లీకి వ్యతిరేకంగా 1 పరుగు తీసుకొని తన యాభైని పూర్తి చేశాడు. ఇది అతని అంతర్జాతీయ కెరీర్‌లో తొలి యాభై.
Centuries from Jadeja (110*) and Rohit Sharma (131) guide #TeamIndia to 326/5 at Stumps on Day 1 of the 3rd Test.
Scorecard – https://t.co/eYpzVPnUf8 #INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/KVSDlNKmQG
— BCCI (@BCCI) February 15, 2024
రోహిత్-జడేజా 204 పరుగుల భాగస్వామ్యం..
రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా మధ్య 204 పరుగుల భాగస్వామ్యం ఉంది. రోహిత్ వికెట్‌తో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. 131 పరుగుల వద్ద రోహిత్ మార్క్ వుడ్‌కు బలయ్యాడు.
భారత్ ప్లేయింగ్-XI:
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా.
ఇంగ్లండ్ ప్లేయింగ్-XI:
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




