Watch Video: మరోసారి అదే కథ.. విఫలమైన కోహ్లీ.. యువ బౌలర్ చేతిలో స్పల్ప స్కోర్‌కే బలి..

ఇంగ్లండ్ తరపున నాలుగో టెస్టు మాత్రమే ఆడుతున్న యువ ఫాస్ట్ బౌలర్ మాథ్యూ పాట్స్ తన కెరీర్ ప్రారంభంలో కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ రూపంలో ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు పడగొట్టాడు.

Watch Video: మరోసారి అదే కథ.. విఫలమైన కోహ్లీ.. యువ బౌలర్ చేతిలో స్పల్ప స్కోర్‌కే బలి..
Ind Vs Eng Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Jul 01, 2022 | 8:05 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్ టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్‌ జట్టు(Indian Cricket Team)కు ఏమాత్రం కలసిరావడం లేదు. శుక్రవారం జులై 1న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమైన ఈ సిరీస్‌లో ఐదవ, చివరి టెస్టు మొదటి రోజునే భారత బ్యాటింగ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో విరాట్ కోహ్లి(Virat Kohli)పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నప్పటికీ.. మాజీ కెప్టెన్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక యువ ఫాస్ట్ బౌలర్ మాథ్యూ పాట్స్‌కు బలయ్యాడు. నెల రోజుల క్రితమే టెస్టుల్లో అరంగేట్రం చేసి తొలి ఇన్నింగ్స్ నుంచి దిగ్గజాల వేట సాగిస్తోన్న మాథ్యూ పాట్స్(Matthew Potts) విరాట్ కోహ్లీ పాలిట యముడిలా మారాడు.

విలియమ్సన్ దారిలోనే..

ఇవి కూడా చదవండి

చాలా కాలంగా పరుగుల కోసం పోరాడుతున్న విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్‌లో ఈ చివరి టెస్టుతో తన బ్యాడ్ ఫేజ్‌కు తెరపడుతుందని అంతా భావించారు. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అతను రెండు మంచి ఇన్నింగ్స్‌లు ఆడి ఆశలు పెంచుకున్నాడు. ఆ తర్వాత బర్మింగ్‌హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో జట్టు పేలవమైన ఆరంభం తర్వాత, అతను చాలా సేపు క్రీజులో ఉంటాడని భావించారు. కానీ, అతను క్రీజులోకి వచ్చిన 6 ఓవర్లలోనే ఈ ఆశలు ఆవిరైపోయాయి. 23 ఏళ్ల యువ పేసర్ పాట్స్.. తన నాల్గవ టెస్టును మాత్రమే ఆడుతున్నాడు. న్యూజిలాండ్‌పై 4 ఇన్నింగ్స్‌లలో అనుభవజ్ఞుడైన కివీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను 3 సార్లు అవుట్ చేశాడు.

నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం..

ఛెతేశ్వర్ పుజారా అవుటైన తర్వాత తొలి సెషన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి కొన్ని బంతులు మాత్రమే ఆడాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేయాల్సి వచ్చింది. రెండు గంటల తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది. ఈసారి వరుసగా రెండో సెషన్‌లో ఆట ప్రారంభమై కొన్ని ఓవర్లలోనే భారత్ తొలుత హనుమ విహారి, ఆ తర్వాత కోహ్లీ వికెట్లను కోల్పోయింది. రెండు ఓవర్లలోనే మాథ్యూ పాట్స్ రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత కోహ్లీ నిర్ణయంలో పొరపాటు కారణంగా ఔటయ్యాడు. నిజానికి, అతను పాట్స్ నుంచి బంతిని ఆడటం, వదిలివేయడంలో సందిగ్ధంలో పడడంతో బలయ్యాడు. అయితే, చివరి క్షణంలో వికెట్ కీపర్ కోసం బంతిని వదిలివేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయింది. తన బ్యాట్‌ను గాలిలో పైకి లేపడానికి ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్ దిగువకు తగిలి స్టంప్‌ను తాకింది.

దారుణంగా భారత బ్యాటింగ్..

కోహ్లి మాత్రమే కాదు, భారత జట్టులోని మిగిలిన బ్యాట్స్‌మెన్‌ల పరిస్థితి కూడా బాగా లేదు. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ త్వరగా ఆరంభించి కొన్ని మంచి స్ట్రోక్‌లు ఆడాడు. అయితే 17 పరుగులు చేసిన తర్వాత జేమ్స్ అండర్సన్‌కు బలి అయ్యాడు. ఓపెనింగ్‌కు అతనితో పాటు వచ్చిన ఛెతేశ్వర్ పుజారా కూడా గంటకు పైగా గడిపినప్పటికీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేక అండర్సన్‌కు బలయ్యాడు. అదే సమయంలో విహారి కూడా విఫలంకాగా, శ్రేయాస్ అయ్యర్ కూడా టీం స్కోర్ 100 పరుగులలోపే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం 33 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 110 పరుగులు చేసింది. క్రీజులో జడేజా 7, పంత్ 18 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.