Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SL vs AUS: కపిల్ దేవ్‌‌ను వెనక్కునెట్టిన ఆస్ట్రేలియా బౌలర్.. టాప్‌ 10లో చోటు.. లిస్టులో ఎవరున్నారంటే?

టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఆస్ట్రేలియా స్పిన్నర్ లియాన్ కపిల్ దేవ్‌ను అధిగమించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో లియాన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో కపిల్ 434 వికెట్ల సంఖ్యను అధిగమించాడు.

SL vs AUS: కపిల్ దేవ్‌‌ను వెనక్కునెట్టిన ఆస్ట్రేలియా బౌలర్.. టాప్‌ 10లో చోటు.. లిస్టులో ఎవరున్నారంటే?
Sl Vs Aus Nathan Lyon
Follow us
Venkata Chari

|

Updated on: Jul 01, 2022 | 7:40 PM

టెస్టు క్రికెట్‌లో ప్రతి వికెట్‌కు బౌలర్ కృషితోపాటు అదృష్టం కూడా అవసరం అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఒక బౌలర్ టెస్ట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 లిస్ట్‌లో తన స్థానాన్ని సంపాదించుకుంటే, అది ఖచ్చితంగా భారీ విజయమే. ఆస్ట్రేలియా దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ కూడా ఈ ఘనతను సాధించాడు. అతను భారత దిగ్గజ పేసర్ కపిల్ దేవ్‌ను వెనక్కునెట్టి మరీ ఈ ఘనత సాధించాడు.

  1. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఆస్ట్రేలియా స్పిన్నర్ లియాన్ కపిల్ దేవ్‌ను అధిగమించాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో లియాన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో కపిల్ 434 వికెట్ల సంఖ్యను అధిగమించాడు.
  2. గాలే టెస్టులో మూడో రోజు శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో లియాన్ 31 పరుగులకు 4 వికెట్లు తీసి, ఒకప్పుడు ప్రపంచ రికార్డును నెలకొల్పిన కపిల్ దేవ్‌ను వెనక్కి నెట్టాడు. లియాన్ ప్రస్తుతం 109 టెస్టుల్లో 436 వికెట్లు పడగొట్టాడు. దీంతో 10వ అత్యంత విజయవంతమైన టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు.
  3. గ్రేట్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అదే సమయంలో, టాప్ 10లో లియాన్‌తో సహా మొత్తం 4 మంది బౌలర్లు ఉన్నారు. వీరిలో లియాన్‌తో పాటు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.
  4. గాలె టెస్టు విషయానికొస్తే.. లియాన్ పదునైన బౌలింగ్ ముందు శ్రీలంక కేవలం 3 రోజుల్లోనే సొంతగడ్డపై 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడో రోజు శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను కేవలం 113 పరుగులకే కుదించగా, ఆస్ట్రేలియా కేవలం 5 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో లియాన్ 9 వికెట్లు పడగొట్టాడు.