IND vs BAN: ఉప్పల్‌లో భారత్- బంగ్లా టీ20 ఫైట్.. టాస్ గెలిచిన సూర్య.. అందరి కళ్లు అతనిపైనే
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆఖరి టీ20 సమరానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మరికొన్ని క్షణాల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. అయితే చివరి మ్యాచ్ లోనూ గెలిచ బంగ్లాను క్వీన్ స్వీప్ చేయాలని సూర్య కుమార్ అండ్ కో భావిస్తోంది.
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆఖరి టీ20 సమరానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మరికొన్ని క్షణాల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉంది. అయితే చివరి మ్యాచ్ లోనూ గెలిచ బంగ్లాను క్వీన్ స్వీప్ చేయాలని సూర్య కుమార్ అండ్ కో భావిస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమ్ ఇండియా ఒక మార్పు చేయగా బంగ్లాదేశ్ 2 మార్పులు చేసింది. అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో రవి బిష్ణోయ్‌ని టీమ్ ఇండియా ఎంపిక చేసింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో హర్షిత్ రాణాకు టీమిండియాలో అరంగేట్రం చేసే అవకాశం ఉంటుందనే టాక్ వచ్చింది. అయితే హర్షిత్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఎంపికకు అందుబాటులో లేరని బీసీసీఐ సమాచారం. కాబట్టి హర్షిత్ అరంగేట్రం చేయాలంటే తదుపరి టీ20 సిరీస్ వరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ మ్యాచ్ లో అందరి కళ్లు తెలుగబ్బాయి నితీష్ కుమార్ రెడ్డిపైనే ఉన్నాయి. గత మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అతను ఉప్పల్ లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మహ్మదుల్లా చివరి టీ20 మ్యాచ్
బంగ్లాదేశ్ వెటరన్ ఆల్ రౌండర్ మహ్మదుల్లాకు ఇదే చివరి టీ20 మ్యాచ్. రెండో టీ20 మ్యాచ్‌కు ముందు అక్టోబర్ 8న రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మదుల్లా. వన్డే క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు మహ్మదుల్లా తెలిపాడు.
టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్.
Have a look at #TeamIndia‘s Playing XI for the 3rd and Final #INDvBAN T20I 🙌
Live – https://t.co/ldfcwtHGSC@IDFCFIRSTBank pic.twitter.com/kQlLjRgpnt
— BCCI (@BCCI) October 12, 2024
బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్:
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, రిషద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తన్జిమ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..