AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: బంగ్లాతో తలపడే భారత్ ప్లేయింగ్ XI ఇదే.. 4గురు ఔట్.. మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్?

IND vs BAN Weather Report: ఐసీసీ టీ20 ప్రపంచకప్, భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్: మ్యాచ్ బుధవారం అడిలైడ్‌లో జరగనుంది. భారత ప్లేయింగ్ XIలో రెండు మార్పులు రానున్నాయి.

IND vs BAN: బంగ్లాతో తలపడే భారత్ ప్లేయింగ్ XI ఇదే.. 4గురు ఔట్.. మ్యాచ్‌కు వర్షం ఎఫెక్ట్?
Ind Vs Ban Playing 11
Venkata Chari
|

Updated on: Nov 01, 2022 | 4:58 PM

Share

బుధవారం అడిలైడ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇంకా టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ రేసులోనే నిలిచాయి. గ్రూప్ 2లో టీం ఇండియా రెండో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ మూడో స్థానంలో నిలిచింది. రేపు జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే, ఆ జట్టు తన గ్రూప్‌లో టాపర్‌గా నిలుస్తుంది. అదే సమయంలో సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశ కూడా బలంగా ఉంటుంది. టీమ్ ఇండియా గురించి చెప్పాలంటే, ఈ మ్యాచ్‌కి పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో ప్లేయింగ్ XIలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ 11లో ఓ మార్పు చేసింది. అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా జట్టులోకి వచ్చాడు. ఈ ప్రయోగం విఫలమైంది. టీ20 ప్రపంచ కప్ 2022లో భారత జట్టు కూడా తన మొదటి మ్యాచ్‌లో ఓడిపోయింది. బంగ్లాదేశ్‌పై కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులతోనే టీమ్ ఇండియా బరిలోకి దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తు్న్నాయి. ఎలాంటి మార్పులు జరగొచ్చో.. ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

టీమ్ ఇండియాలో 2 మార్పులు పక్కా..

మీడియా కథనాల ప్రకారం, టీమ్ ఇండియా రెండు మార్పులతో బంగ్లాదేశ్‌తో ఆడవచ్చు. మొదటి మార్పు హుడా బెంచ్‌పై కూర్చోవడం. అతని స్థానంలో అక్షర్ పటేల్ తిరిగి రావడం. రెండో మార్పు రిషబ్ పంత్ ప్లేయింగ్ XIలోకి తిరిగి రావడం. ఈ టీ20 ప్రపంచకప్‌లో పంత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ గాయపడ్డాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో అతనికి విశ్రాంతి ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

జట్టులో కేఎల్ రాహుల్..

టీ20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ బ్యాట్‌తో విఫలమైన కేఎల్ రాహుల్ జట్టులో కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ పాకిస్థాన్‌పై 4, నెదర్లాండ్స్‌పై 9, దక్షిణాఫ్రికాపై కూడా 9 పరుగులు చేసిన తర్వాత ఔట్ అయ్యాడు.

అశ్విన్ స్థానంలో చాహల్‌కి అవకాశం?

అశ్విన్ స్థానంలో యుజువేంద్ర చాహల్‌కు అవకాశం దక్కుతుందా లేదా అన్నదే ప్రశ్నగా మారింది. గత మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ చాలా ఖరీదైనదిగా మారింది. అదే సమయంలో చాహల్‌కు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. చాహల్ పునరాగమనం కచ్చితంగా కష్టమేనని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో నలుగురు ఆటగాళ్లు దూరం కానున్నారు. ఇందులో యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్ పేర్లు చేరవచ్చని తెలుస్తోంది.

అడిలైడ్‌లో వర్షం..

అడిలైడ్ వాతావరణంపై వస్తున్న వార్తల ప్రకారం ఆ రోజు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గంటకు 20-30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అయితే సాయంత్రం వర్షం కురుస్తుంది. నవంబర్ 2న, అడిలైడ్‌లో 60-70 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. అడిలైడ్‌లోని వాతావరణ ప్రభావం భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌పై ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్ వాష్ అవుట్ అయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సెమీస్ సమీకరణాలు మొత్తం మారిపోతాయి.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ఓడిపోవడం భారత్‌కు మంచి సంకేతం కాదు. ఎందుకంటే ఇది సెమీ-ఫైనల్ సమీకరణాన్ని పాడు చేస్తుంది. టీమ్ ఇండియా దృష్టిలో రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లోనైనా గెలవాల్సి ఉంది.

భారత ప్రాబబుల్ ప్లేయింగ్ XI –

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆర్ అశ్విన్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ షమీ.