ENG vs NZ: న్యూజిలాండ్ ఓటమితో ఆస్ట్రేలియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ విజయంతో ఆసక్తిగా సెమీస్ రేస్..

ఇంగ్లండ్‌ విజయంతో గ్రూప్‌-1 సమీకరణం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు తలో నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు పాయింట్లు సాధించాయి.

ENG vs NZ: న్యూజిలాండ్ ఓటమితో ఆస్ట్రేలియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ విజయంతో ఆసక్తిగా సెమీస్ రేస్..
Eng Vs Nz Result
Follow us

|

Updated on: Nov 01, 2022 | 6:27 PM

టీ20 ప్రపంచకప్‌లోని సూపర్‌-12 గ్రూప్‌-1 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ అందించిన 180 పరుగుల లక్ష్యం చేరుకోలేక న్యూజిలాండ్‌ టీం చతికిలపడింది. దీంతో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. కివీస్ తరపున గ్లెన్ ఫిలిప్స్ 36 బంతుల్లో 62 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ 73 పరుగుల అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు.

అనంతరం న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ తరపున గ్లెన్ ఫిలిప్స్ అత్యధికంగా 62 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, శామ్ కుర్రాన్ చెరో రెండు వికెట్లు తీశారు. మార్క్ వుడ్, బెన్ స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్‌ విజయంతో గ్రూప్‌-1 సమీకరణం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు తలో నాలుగు మ్యాచ్‌ల్లో ఐదు పాయింట్లు సాధించాయి.

గ్రూప్ A (సూపర్ 12) పాయింట్ల పట్టిక..

క్రమ సంఖ్య జట్టు ఆడింది గెలిచినవి ఓడిపోయినవి N/R టై నెట్ రన్ రేట్ పాయింట్లు
1 న్యూజిలాండ్న్యూజిలాండ్ 4 2 1 1 0 +2.233 5
2 ఇంగ్లండ్ఇంగ్లండ్ 4 2 1 1 0 +0.547 5
3 ఆస్ట్రేలియాఆస్ట్రేలియా 4 2 1 1 0 -0.304 5
4 శ్రీలంకశ్రీలంక 4 2 2 0 0 -0.457 4
5 ఐర్లాండ్ఐర్లాండ్ 4 1 2 1 0 -1.544 3
6 ఆఫ్ఘనిస్తాన్ఆఫ్ఘనిస్తాన్ 4 0 2 2 0 -0.718 2

న్యూజిలాండ్‌కు ఆరంభం అంతగా బాగోలేదు. 8 పరుగుల స్కోరు వద్ద డెవాన్ కాన్వే వికెట్ల వెనుక జోస్ బట్లర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఫిన్ అలెన్ కూడా నిరాశపరిచాడు. 11 బంతుల్లో 16 పరుగులు చేసి సామ్ కుర్రాన్‌కి వికెట్ సమర్పించాడు. అలెన్ 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అందులో ఒక సిక్స్‌ ఉంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను బెన్ స్టోక్స్ మూడో వికెట్‌గా ఔట్ చేశాడు. 40 బంతుల్లో 40 పరుగులు చేశాడు. జిమ్మీ నీషమ్ షార్ట్ పిచ్ బౌన్సర్‌ను ఎదుర్కొనలేక సామ్ కుర్రాన్ చేతికి చిక్కాడు. 3 బంతుల్లో 6 పరుగులు చేశాడు. క్రిస్ వోక్స్ వేసిన స్లో బాల్ లాంగ్ ఆన్‌లో నిలబడిన క్రిస్ జోర్డాన్ చేతిలో డారిల్ మిచెల్ (3) క్యాచ్ ఇచ్చాడు. న్యూజిలాండ్‌కు గ్లెన్ ఫిలిప్స్ అతిపెద్ద ఆశగా మారాడు. కానీ, 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఊపులో కనిపించినా.. 36 బంతుల్లో 62 పరుగులు చేసిన తర్వాత సామ్ కుర్రాన్‌కు బలయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఇరు జట్ల ప్లేయింగ్-11..

ఇంగ్లండ్: జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్, డేవిడ్ మలన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, శామ్ కుర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.