IND vs AUS: 519 రోజుల తర్వాత కోహ్లీ విలన్ రీఎంట్రీ.. కేఎల్ రాహుల్‌కి స్ట్రాంగ్ వార్నింగ్
Scott Boland: అడిలైడ్ టెస్టులో, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విరాట్ కోహ్లీని రెండుసార్లు అవుట్ చేసిన బౌలర్ తిరిగి ఆస్ట్రేలియా జట్టులోకి రావచ్చు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు, ఈ బౌలర్ కేఎల్ రాహుల్‌ను కూడా హెచ్చరించడం గమనార్హం.
Scott Boland: పెర్త్ టెస్టులో టీమిండియా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు అడిలైడ్‌లో మరో కొత్త ఛాలెంజ్ ఎదురుకానుంది. వాస్తవానికి, భారత జట్టు అడిలైడ్‌లో డే-నైట్ టెస్ట్ ఆడాల్సి ఉంది. ఇందులో ఆటగాళ్లకు అనుభవం చాలా తక్కువ. డిసెంబరు 6న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గులాబీ బంతిని ఎదుర్కోవడం సవాలుగా మారనుంది. ఈ సమయంలో రోహిత్ శర్మ జట్టు స్కాట్ బోలాండ్ రూపంలో మరో పెద్ద సవాలును ఎదుర్కోవాల్సి రానుంది. హాజిల్‌వుడ్ గాయం తర్వాత, అతను ఆస్ట్రేలియన్ జట్టులోకి తిరిగి రావడం దాదాపు ఖాయమైంది.
ప్రాక్టీస్ మ్యాచ్‌లో సవాల్ చేస్తా..
అడిలైడ్ టెస్టుకు ముందు భారత్, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్ల మధ్య రెండు రోజుల డే-నైట్ ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఇందులో బోలాండ్ తన జట్టు పేస్ అటాక్‌కు నాయకత్వం వహించనున్నాడు. అతను ఆస్ట్రేలియా ప్రధాన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. అందుకే రెండో మ్యాచ్‌లో ఆడడం ఖాయమని భావిస్తున్నారు. ఇదే జరిగితే 519 రోజుల తర్వాత మరోసారి టెస్టు క్రికెట్ ఆడడం ఖాయం. అతను 6 జులై 2023న చివరి టెస్టు ఆడాడు. 35 ఏళ్ల బోలాండ్ 2021లో ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను 10 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 20.34 సగటుతో 35 వికెట్లు తీశాడు. ఈ కాలంలో అతని ఎకానమీ రేటు 2 కంటే తక్కువగా ఉంది.
డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీ రెండుసార్లు ఔట్ చేశాడుగా..
2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో స్కాట్ బోలాండ్ కూడా భారత్‌పై బౌలింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్‌ను హెచ్చరించాడు. తన సొంత గ్రౌండ్‌లో రాహుల్‌కు బౌలింగ్ చేయడం వచ్చే సరదా వేరుగా ఉంటుందని బోలాండ్ చెప్పాడు.
గతేడాది భారత పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుతో కలిసి వచ్చిన బోలాండ్ ఓ టెస్టు మ్యాచ్‌లో రాహుల్‌కి బౌలింగ్ చేశాడు. రాహుల్‌ను అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌గా అభివర్ణించిన అతను.. ఆస్ట్రేలియన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించే బ్యాట్స్‌మెన్‌గా ప్రసంశలు కురిపించాడు. కేఎల్ రాహుల్‌నే టార్గెట్ చేయనున్నట్లు ఆస్ట్రేలియా పేసర్ పేర్కొన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..