Delhi Capitals: ఢిల్లీ కెప్టెన్సీ రేసు నుంచి కేఎల్ రాహుల్ ఔట్..? ఊహించని పేరుతో షాకిచ్చిన ఫ్రాంచైజీ

Delhi Capitals IPL 2025 Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీకి పోటీదారు ఎవరు? దీనిపై సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అక్షర్ పటేల్ కూడా పోటీదారు అని నమ్ముతారు. జట్టు కెప్టెన్సీని కూడా కేఎల్ రాహుల్ నిర్వహించగలడా? దీనిపై టీమ్ ఓనర్ పార్త్ జిందాల్ కూడా క్లారిటీ ఇచ్చాడు.

Delhi Capitals: ఢిల్లీ కెప్టెన్సీ రేసు నుంచి కేఎల్ రాహుల్ ఔట్..? ఊహించని పేరుతో షాకిచ్చిన ఫ్రాంచైజీ
Kl Rahul
Follow us
Venkata Chari

|

Updated on: Nov 30, 2024 | 12:31 PM

Will KL Rahul lead Delhi Capitals in IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలం తర్వాత, ఇప్పుడు చాలా జట్ల ముందు ఉన్న అతిపెద్ద సవాలు ఏంటంటే.. తమ జట్టుకు కెప్టెన్‌గా ఎవరిని చేయాలి? అంటూ వినిపిస్తోన్న ప్రశ్నలు. ఈ క్రమంలో ప్రస్తుతం కెప్టెన్ కోసం వెతుకుతున్న జట్లను ఓసారి పరిశీలిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ ముందున్నాయి. మిగతా జట్లైనా సన్‌రైజర్స్ హైదరాబాద్ (పాట్ కమిన్స్), చెన్నై సూపర్ కింగ్స్ (రుతురాజ్ గైక్వాడ్), గుజరాత్ టైటాన్స్ (శుభ్‌మన్ గిల్), ముంబై ఇండియన్స్ (హార్దిక్ పాండ్యా), రాజస్థాన్ రాయల్స్ (సంజూ శాంసన్) జట్లకు మాత్రమే కెప్టెన్లు ఉన్నారు.

ఇక ఢిల్లీ క్యాపిట్స్ విషయానికి వస్తే.. జట్టులో కేఎల్ రాహుల్, ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీ మెటీరియల్‌తో సిద్ధంగా ఉన్నారు. అక్షర్ పటేల్ కూడా కెప్టెన్సీకి పోటీదారుగా నిలిచాడు. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్సీపై ఇప్పటి వరకు ఉత్కంఠ నెలకొంది.

అక్షర్ పటేల్ (16.50 కోట్లు), కుల్దీప్ యాదవ్ (13.25 కోట్లు), ట్రిస్టన్ స్టబ్స్ (10 కోట్లు), అభిషేక్ పోరెల్ (4 కోట్లు)లను ఢిల్లీ క్యాపిటల్స్ తన వద్ద ఉంచుకుంది. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ జట్టు కేఎల్ రాహుల్‌ను రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ విషయంపై జట్టు యజమాని పార్త్ జిందాల్ మొత్తం పరిస్థితిని స్పష్టం చేశారు. జిందాల్ మాట్లాడుతూ- కెప్టెన్సీ గురించి మాట్లాడటం కొంచెం తొందరగా ఉంది. అక్షర్ పటేల్ చాలా కాలంగా ఫ్రాంచైజీతో ఉన్నారు. గత సైకిల్‌లో అతను వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కాబట్టి, ఈ పాత్రలో ఎవరు వస్తారో మాకు ఇంకా తెలియదు.. ఇంకా చాలా సమయం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

‘నేను కేఎల్ (రాహుల్)తో మాట్లాడాను. కానీ ఇంకా కలవలేదు. నాకు అతను వ్యక్తిగతంగా బాగా తెలుసు’ అంటూ తెలిపాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వివరాలు..

– ఇప్పటి వరకు ఖర్చు: రూ.119.80 కోట్లు.

– ఎంత మిగిలింది: రూ.20 లక్షలు.

– కొనుగోలు చేసిన ఆటగాళ్ళు: 23/25

– కొనుగోలు చేసిన విదేశీయులు: 7/8

ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు..

1. అక్షర్ పటేల్, ఆల్ రౌండర్ – రూ. 16.50 కోట్లు. 2. కేఎల్ రాహుల్, బ్యాటర్ – రూ. 14.00 కోట్లు. 3. కుల్దీప్ యాదవ్, బౌలర్ – రూ. 13.25 కోట్లు. 4. మిచెల్ స్టార్క్, బౌలర్ – రూ. 11.75 కోట్లు. 5. టి నటరాజన్, బౌలర్ – రూ. 10.75 కోట్లు. 6.ట్రిస్టన్ స్టబ్స్, బౌలర్ – రూ. 10.00 కోట్లు. 7. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, బౌలర్ – రూ. 9.00 కోట్లు. 8. ముఖేష్ కుమార్, బౌలర్ – రూ. 8.00 కోట్లు. 9. హ్యారీ బ్రూక్, బౌలర్ – రూ. 6.25 కోట్లు, అభిషేక్ పోరెల్, బౌలర్ – రూ. 4.00 కోట్లు. 11. అశుతోష్ శర్మ, ఆల్ రౌండర్- రూ. 3.80 కోట్లు. 12. మోహిత్ శర్మ, బౌలర్ – రూ. 2.20 కోట్లు. 13. ఫాఫ్ డు ప్లెసిస్, బ్యాట్స్‌మన్ – రూ. 2.00 కోట్లు. 14. సమీర్ రిజ్వీ, ఆల్ రౌండర్- రూ. 95 లక్షలు. 15. డోనోవన్ ఫెరీరా, బ్యాట్స్‌మన్-రూ. 75 లక్షలు 16. దుష్మంత చమీర, బౌలర్ – రూ. 75 లక్షలు. 17. విప్రరాజ్ నిగమ్, ఆల్ రౌండర్- రూ. 50 లక్షలు. 18. కరుణ్ నాయర్, బ్యాట్స్‌మెన్ – రూ. 50 లక్షలు. 19. మాధవ్ తివారీ, ఆల్ రౌండర్- రూ. 40 లక్షలు 20. మన్వంత్ కుమార్, ఆల్ రౌండర్- రూ. 30 లక్షలు. 21. త్రిపురన్ విజయ్, ఆల్ రౌండర్ – రూ. 30 లక్షలు. 22. దర్శన్ నల్కండే, ఆల్ రౌండర్ – రూ. 30 లక్షలు. 23. అజయ్ మండల్, ఆల్ రౌండర్ – రూ. 30 లక్షలు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..