ఐపీఎల్‌లో ఓనమాలు.. స్టార్ బౌలర్ గాయంతో లక్.. కట్ చేస్తే.. టీమిండియా దిగ్గజాలకే వణుకు పుట్టించిన ధోనీ శిష్యుడు..
Scott Boland: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి తొలిసారిగా WTC టైటిల్‌ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా ఈ విజయంలో ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ కీలక పాత్ర పోషించాడు.
Scott Boland: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి తొలిసారిగా WTC టైటిల్‌ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా ఈ విజయంలో ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ కీలక పాత్ర పోషించాడు. ఓవల్ టెస్టు చివరి రోజున గేమ్ ఛేంజింగ్ స్పెల్‌తో భారత్‌ను వెనక్కి నెట్టాడు.
గేమ్ మార్చిన బోలాండ్ స్పెల్..
ఈ మొత్తం మ్యాచ్‌లో స్కాట్ బోలాండ్ 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2.90 ఎకానమీ వద్ద పరుగులు ఇస్తూ 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీయగా, చివరి రోజు 2 వికెట్లు తీశాడు. స్కాట్ బోలాండ్ స్పెల్‌లో అతిపెద్ద వికెట్ విరాట్ కోహ్లీది. అక్కడి నుంచి మ్యాచ్ ఆస్ట్రేలియా వైపు మళ్లింది. కోహ్లి ఔటైన తర్వాత అదే ఓవర్లో జడేజాను కూడా ఔట్ చేసి భారత్‌ను మ్యాచ్ నుంచి పూర్తిగా తప్పించాడు.
గిల్ వికెట్ కూడా..
స్కాట్ బోలాండ్ నాలుగో రోజు మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు తొలి పురోగతిని అందించాడు. శుభ్‌మన్ గిల్ రూపంలో ఆస్ట్రేలియాకు తొలి వికెట్‌ని బోలాండ్ అందించాడు. ఆ తర్వాత రోజంతా వికెట్ పడకపోయినా ఐదో రోజు ఆట ప్రారంభమైన వెంటనే తన నాలుగో ఓవర్లో విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టి మ్యాచ్‌ని మలుపు తిప్పాడు. విరాట్ ఔటైన తర్వాత అదే ఓవర్ ఐదో బంతికి రవీంద్ర జడేజాను పెవిలియన్ కు పంపే పనిని బోలాండ్ పూర్తి చేశాడు. ఈ జోరు తర్వాత భారత్ మ్యాచ్‌లో పుంజుకోలేకపోయింది.
View this post on Instagram
బోలాండ్ టెస్ట్ గణాంకాలు..
ఈ యువ బౌలర్ 2021లోనే ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేశాడు. అరంగేట్రంలోనే ఐదు వికెట్లు తీశాడు. బోలాండ్ ఇప్పటివరకు 8 టెస్టులు ఆడగా, అందులో 33 వికెట్లు పడగొట్టాడు. భారత్‌తో అతనికి ఇది రెండో టెస్టు మ్యాచ్ మాత్రమే.
View this post on Instagram
ధోనీ కెప్టెన్సీలో ఆడిన బోలాండ్..
జోష్ హాజిల్‌వుడ్ కారణంగా ఈ మ్యాచ్‌కు ముందు స్కాట్ బోలాండ్ ప్లేయింగ్ XIలో భాగమయ్యాడు. హాజిల్‌వుడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఆ తర్వాత అతను ప్లేయింగ్ XIలో చేరాడు. ఇది కాకుండా, స్కాట్ బోలాండ్ 7 సంవత్సరాల క్రితం 2016 లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో కూడా ఆడాడు. ఐపీఎల్‌లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్ తరపున ఆడాడు . ఆ సీజన్‌లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. అందులో 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
మరిన్ని క్రీడా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..