IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. రెండో వన్డేకు అందుబాటులో లేని ఇద్దరు స్టార్ ప్లేయర్స్.. ఎందుకంటే?
India vs Australia 2nd ODI: ఇండోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా జట్టుకు కీలకం. ఎందుకంటే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు సిరీస్ గెలవాలనే కోరికను సజీవంగా ఉంచుకోవాలంటే రెండో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన అవసరం ఆస్ట్రేలియా జట్టుకు ఉంది. లేదంటే సిరీస్‌ను 2-0తో ఓడిపోనుంది. అయితే, ఈ క్రమంలోనే ఆసీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. కొంతమంది సీనియర్లు ఆడలేరని వార్తలతో ఆందోళనలో పడింది.

India vs Australia 2nd ODI: భారత్ , ఆస్ట్రేలియా మధ్య సెప్టెంబర్ 24న రెండో వన్డే ఇండోర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ కూడా అందుబాటులో లేరు. మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరు ఆటగాళ్లు కనిపించలేదు. ఎడమచేతి వాటం పేసర్ మిచెల్ స్టార్క్ వెన్నునొప్పితో బాధపడుతూ పూర్తిగా కోలుకున్నాడు. అయితే వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా అతడికి తొలి రెండు మ్యాచ్‌ల నుంచి విశ్రాంతినిచ్చారు.
గాయం నుంచి కోలుకుని ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చిన గ్లెన్ మాక్స్ వెల్ కూడా విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో మ్యాక్సీ రెండో మ్యాచ్‌లోనూ ఆడడు. అలాగే తొలి మ్యాచ్‌కు దూరమైన ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని తెలుస్తోంి.
ఆస్ట్రేలియాకు కీలక మ్యాచ్..
ఇండోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా జట్టుకు కీలకం. ఎందుకంటే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు సిరీస్ గెలవాలనే కోరికను సజీవంగా ఉంచుకోవాలంటే రెండో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన అవసరం ఆస్ట్రేలియా జట్టుకు ఉంది.
రెండో మ్యాచ్‌కి ఆస్ట్రేలియా జట్టు ఎలా ఉండనుందంటే?
View this post on Instagram
ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ బరిలోకి దిగనున్నారు.
ఫామ్‌లో ఉన్న మార్నస్ లాబుషాగ్నే 3వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.
మిడిల్ ఆర్డర్‌లో స్టీవ్ స్మిత్ బరిలోకి దిగనున్నాడు.
ఆల్ రౌండర్లుగా మార్కస్ స్టోయినిస్, కెమెరూన్ గ్రీన్ రానున్నారు.
రెండో మ్యాచ్‌లో షాన్ అబాట్ స్థానంలో జోష్ హేజిల్‌వుడ్ వచ్చే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11:
View this post on Instagram
డేవిడ్ వార్నర్
మిచెల్ మార్ష్
మార్నస్ లాబుస్చాగ్నే
స్టీవ్ స్మిత్
జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్)
మార్కస్ స్టోయినిస్
కామెరాన్ గ్రీన్
మాథ్యూ షార్ట్
పాట్ కమిన్స్ (కెప్టెన్)
జోష్ హాజిల్‌వుడ్
ఆడమ్ జాంపా
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, అలెక్స్ కారీ, మార్నస్ లాబుషాగ్నే, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, ఎమ్చెల్ , మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




