AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS 1st Test: నాగ్‌పూర్‌లోని విదర్భ ‘టెస్టు’ రికార్డులివే.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో పైచేయి ఎవరిదంటే..

చాలా మంది క్రికెట్ అభిమానుల అభిప్రాయం ప్రకారం భారత్-పాకిస్థాన్‌.. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా.. జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు రసవత్తరంగా ఉంటాయి. కానీ అదే కోవలోకి వచ్చే మరో ప్రత్యర్థుల జోడీ..

IND vs AUS 1st Test: నాగ్‌పూర్‌లోని విదర్భ ‘టెస్టు’ రికార్డులివే.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో పైచేయి ఎవరిదంటే..
Ind Vs Aus
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 08, 2023 | 1:50 PM

Share

చాలా మంది క్రికెట్ అభిమానుల అభిప్రాయం ప్రకారం భారత్-పాకిస్థాన్‌.. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా.. జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు రసవత్తరంగా ఉంటాయి. కానీ అదే కోవలోకి వచ్చే మరో ప్రత్యర్థుల జోడీ భారత్-ఆస్ట్రేలియా. ఎంతో కాలంగా క్రికెట్ అభిమానులు వేచి చూస్తున్న టెస్టు సిరీస్‌ జరిగే రోజు రానే వచ్చింది. రేపటి(ఫిబ్రవరి 9) నుంచి భారత్‌ వేదికగా ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ జరగనుంది. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ పేరిట జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు నాగ్‌పుర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. మరి ఇప్పటివరకు విదర్భ మైదానంలో జరిగిన మ్యాచ్‌లలో ఆధిక్యం ఎవరిది..? గత గణాంకాలను ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు పరిశీలిద్దాం..

దాదాపు ఐదేళ్ల తర్వాత నాగ్‌పుర్‌ స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరగబోతోంది. చివరిసారిగా 2017 నవంబర్‌లో శ్రీలంకతో భారత్‌ (IND vs SL) తలపడింది. లంకపై ఇన్నింగ్స్‌ 239 పరుగుల భారీ తేడాతో టీమ్‌ఇండియా ఘన విజయం  సాధించింది. అయితే ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఆరు టెస్టులు జరిగాయి. అందులో భారత్‌దే పైచేయి కావడం ఇక్కడ విశేషం. నాలుగు టెస్టుల్లో భారత్ విజయం సాధించగా.. ఒకే ఒక్క మ్యాచ్‌లో ఓటమిపాలైంది. మరొకటి డ్రాగా ముగిసింది. దక్షిణాఫ్రికా చేతిలో(2010)నే  భారత్‌కు పరాభవం ఎదురైంది. తొలి రెండు రోజులు ఫాస్ట్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండి.. మూడో రోజు నుంచి స్పిన్నర్ల పాలిట స్వర్గధామంగా మారుతుందనేది పిచ్‌పై క్రికెట్ విశ్లేషకుల అంచనా.

విదర్భ మైదానంలో తొలి టెస్టు ఆసీస్‌తోనే..

భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) జట్ల మధ్య 2008లో జరిగిన టెస్టు మ్యాచ్‌కు నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఇదే ఈ మైదానంలో తొలి టెస్టు కావడం విశేషం. ఇందులో భారత్‌ 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న నాగ్‌పుర్‌ స్టేడియంలో ఆసీస్‌తో జరిగిన టెస్టులో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌(109)తో పాటు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ అర్ధ శతకాలతో అదరగొట్టేశారు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 441/10 స్కోరు చేసింది. అనంతరం సైమన్ కటిచ్(102), మైకెల్ హస్సీ(90), కామెరూన్ వైట్(46) రాణించడంతో 355 పరుగులు చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 295/10 స్కోరు చేసి.. ఆసీస్‌ ఎదుట 382 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. కానీ అప్పటి భారత జట్టులోని స్పిన్నర్లు హర్భజన్ (4/64), అమిత్ మిశ్రా (3/27)తో పాటు ఇషాంత్ శర్మ (2/31) దెబ్బకు ఆసీస్‌ 209 పరుగులకే కుప్పకూలి 172 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ప్రస్తుత కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ (0, 2) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమై నిరాశపరిచాడు.

ఇవి కూడా చదవండి

విదర్భ స్టేడియంలోని మరికొన్ని విశేషాలు..

  1. అత్యధిక స్కోరు: 610/6 డిక్లేర్డ్‌. శ్రీలంకపై భారత్‌ చేసిన పరుగులు.
  2. అత్యల్ప స్కోరు: దక్షిణాఫ్రికా 2015/16 సీజన్‌లో భారత్‌పై 79 పరుగులకు ఆలౌట్‌.
  3. భారత్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు: దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా 253* పరుగులను భారత్‌పై (2010/11)సాధించాడు.
  4. ఉత్తమ బౌలింగ్‌ ప్రదర్శన: భారత్‌పై (2008/2009) ఆసీస్ బౌలర్ జాసన్ క్రెజా 8/215.
  5. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్: టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ 357 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 354 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇప్పుడు కోహ్లీ ఈ టెస్టులో మరో నాలుగు పరుగులు చేస్తే సెహ్వాగ్‌ను అధిగమించే అవకాశం ఉంది.
  6. అత్యధిక వికెట్లు: ఆసీస్‌ హడలెత్తిస్తున్న రవిచంద్రన్ అశ్విన్‌ ఇక్కడ అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్‌ కావడం విశేషం. ఇప్పటి వరకు 19 వికెట్లను పడగొట్టాడు ఈ వెటరన్ స్పిన్నర్.

మరిన్నిక్రీడా వార్తల కోసం క్కడ క్లిక్ చేయండి..