IND Vs AUS: ఆసీస్‌తో టెస్ట్ సిరీస్.. టీమిండియాకు పొంచివున్న రెండు ప్రమాదాలు.. వివరాలు ఇవిగో!
ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా..
ఫిబ్రవరి 9వ తేదీ నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతుంటే.. గత సిరీస్‌ల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడమే కాదు.. 19 ఏళ్లగా భారత్‌లో టెస్ట్ సిరీస్ విజయాన్ని ఎరుగని ఆసీస్.. ఆ కోరికను కూడా తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ సిరీస్ విజయంతో రోహిత్ శర్మ అండ్ కో పలు రికార్డులు బ్రేక్ చేయనుండగా.. వారికి రెండు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా.?
ఈ సిరీస్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ టిక్కెట్టు ఆధారపడి ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు భారీ విజయాలను సాధిస్తేనే వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కించుకోగలదు. అలాగే ఈ సిరీస్ విజయంతో భారత్ స్వదేశంలో తన విజయాల పరంపరను కొనసాగించవచ్చు. 2012 నుంచి స్వదేశంలో భారత్ ఏ టెస్టు సిరీస్‌ను కోల్పోలేదు. అదే సమయంలో, గత 10 ఏళ్లలో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రం టీమిండియా ఓటమి చవి చూసింది. కాబట్టి కచ్చితంగా హిట్‌మ్యాన్ ఈ రికార్డు బ్రేక్ అవ్వకుండా చూసుకునేందుకే ప్రణాళికలు సిద్దం చేస్తాడు. అటు ఈ సిరీస్ విజయంతో టీమిండియా మళ్లీ టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకోవాలని టీమిండియా తహతహలాడుటోంది. 2016లో తన స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్, ఆ తర్వాత 2018-19, 2020-21లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించి ట్రోఫీని దక్కించుకున్న సంగతి తెలిసిందే.