AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWC 2023 Semi Final Rules: సెమీఫైనల్‌లో వర్షం పడితే ఫలితం ఎలా నిర్ణయిస్తారు? పూర్తి సమాచారం ఇదిగో..

ICC World Cup 2023: భారతదేశంలోని కోస్తా ప్రాంతాల్లో రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి, ఈ మ్యాచ్‌లకు కూడా వర్షం ఆటంకం కలిగిస్తుందనే భయం ఉంది. అయితే ఈ భయం మధ్య ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ జరగడం ఖాయం. ఎందుకంటే సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల ఫలితాలను నిర్ణయించడానికి ఐసీసీ నిబంధనలను ప్రవేశపెట్టింది.

CWC 2023 Semi Final Rules: సెమీఫైనల్‌లో వర్షం పడితే ఫలితం ఎలా నిర్ణయిస్తారు? పూర్తి సమాచారం ఇదిగో..
Cwc 2023 Final
Venkata Chari
|

Updated on: Nov 13, 2023 | 9:20 PM

Share

CWC 2023 Semi Final Rules: వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. నవంబర్ 16న కోల్‌కతాలో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

భారతదేశంలోని కోస్తా ప్రాంతాల్లో రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి, ఈ మ్యాచ్‌లకు కూడా వర్షం ఆటంకం కలిగిస్తుందనే భయం ఉంది. అయితే ఈ భయం మధ్య ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ జరగడం ఖాయం. ఎందుకంటే సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల ఫలితాలను నిర్ణయించడానికి ఐసీసీ నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆ నిబంధనల ప్రకారం ఈసారి కూడా నాకౌట్‌ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి..

1- రిజర్వ్ డే ప్లే: సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల సమయంలో వర్షం కురిస్తే, మ్యాచ్ రిజర్వ్ డే ప్లేలో కొనసాగుతుంది. అంటే బుధవారం మ్యాచ్ నిర్వహించలేకపోతే గురువారం మ్యాచ్ నిర్వహించనున్నారు.

2- మ్యాచ్ కొనసాగింపు: వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలో ఆగిపోతే, మరుసటి రోజు మ్యాచ్ కొనసాగుతుంది. ఇక్కడ మ్యాచ్ ఆగిపోయిన పాయింట్ నుంచి మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఉదాహరణకు- టీమ్ ఇండియా 25 ఓవర్లలో 200 పరుగులు చేసిన సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే, మరుసటి రోజు 26వ ఓవర్ నుంచి టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది.

3- అదనపు 120 నిమిషాలు: సెమీ-ఫైనల్ మ్యాచ్‌లకు అదనపు 2 గంటలు కేటాయించారు. ఉదాహరణకు 6 గంటలకు మ్యాచ్ ఆపి మళ్లీ 8 గంటలకు ప్రారంభిస్తే ఓవర్ల తగ్గింపు ఉండదు.

4- ఓవర్ల తగ్గింపు: పైన పేర్కొన్న విధంగా, ఓవర్లు 2 గంటల అదనపు సమయం తర్వాత మాత్రమే తగ్గించబడతాయి. అంటే, వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగితే అదనంగా 2 గంటల పాటు ఓవర్‌లను కట్ చేయరు. ఆ తర్వాత ప్రతి 5 నిమిషాలకు ఒక ఓవర్ కట్ అవుతుంది.

5- 20 ఓవర్ల దగ్గర ఫలితం: సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఫలితాన్ని నిర్ణయించడానికి రెండు జట్లూ కనీసం 20 ఓవర్లు ఆడాలి. అదేంటంటే.. తొలి ఇన్నింగ్స్ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన జట్టు డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం ఫలితాన్ని నిర్ణయించాలంటే కనీసం 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది.

6- లీగ్ స్థాయి పాయింట్లు: సెమీ-ఫైనల్ మ్యాచ్ పూర్తిగా వర్షం పడి, రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ పూర్తి చేయలేకపోతే, పాయింట్ల పట్టికలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టు విజేతగా ప్రకటించనున్నారు. ఉదాహరణకు- భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే, అగ్రస్థానంలో ఉన్న భారత్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..