Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇక చాలు ఆజామూ.. 4 ఏళ్లుగా పొడించేదేమీ లేదు: పాక్ సారథి మాజీ ప్లేయర్ విమర్శలు..

Pakistan Cricket Team, Babar Azam: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టును ఆఫ్ఘనిస్తాన్ టీం ఓడించింది. ఈ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలవగలిగింది. మొత్తంగా ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి, టోర్నీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్నారు.

Video: ఇక చాలు ఆజామూ.. 4 ఏళ్లుగా పొడించేదేమీ లేదు: పాక్ సారథి మాజీ ప్లేయర్ విమర్శలు..
Babar Azam
Follow us
Venkata Chari

|

Updated on: Nov 14, 2023 | 6:30 AM

Pakistan Cricket Board: వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ప్రపంచ కప్ ప్రారంభంలో, చాలా మంది ఈ జట్టును సెమీ-ఫైనల్‌కు పోటీదారుగా పరిగణించారు. అయితే, బాబర్ సేన అంచనాలకు అనుగుణంగా రాణించలేక పేలవమైన ప్రదర్శనతో స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో పాక్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఓ వేదికపై బాబర్‌ను తీవ్రంగా విమర్శించాడు. బాబర్ నాలుగేళ్లుగా జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కానీ, పరిస్థితి ఇంకా మెరుగుపడలేదంటూ విమర్శించాడు.

వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను కూడా ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. ఈ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలవగలిగింది. దీంతో పాక్ జట్టు ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ ఆటగాళ్లు ఇప్పుడు తమ ఇళ్లకు చేరుకున్నారు.

వైఫల్యం కొనసాగుతుంది..

బాబర్ గొప్ప ఆటగాడు అని పాకిస్థాన్ జట్టు ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది మామ షాహిద్ అఫ్రిది అన్నారు. టాప్ కెప్టెన్ల జాబితాలో బాబర్ పేరు రాయాలని తాను కోరుకున్నానని, అయితే, అలా చేయలేకపోయాడని విమర్శించాడు. బాబర్ మూడు-నాలుగేళ్లుగా జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడని, ఈ కాలంలో అతని కెప్టెన్సీకి ఎప్పుడూ ప్రమాదం లేదని ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. అందరూ బాబర్‌కు మద్దతు ఇచ్చారని, అయితే మూడు-నాలుగేళ్లలో కూడా అతను మెరుగైన కెప్టెన్‌గా నిరూపించుకోవడంలో విఫలమయ్యాడంటూ ఘాటుగా విమర్శించాడు. ఒక నాయకుడు తనతో పాటు ఇతర ఆటగాళ్లను తీసుకెళ్తాడని, అయితే బాబర్ దీన్ని చేయలేదని, అతని కెప్టెన్సీలో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆఫ్రిది తెలిపాడు.

కెప్టెన్ పదవికి దూరం కావొచ్చు..

ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టు లక్ష్యాన్ని చేధించింది. పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చే వారం జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌ను కలవనుంది. ఈ పేలవమైన ప్రదర్శన తర్వాత, బాబర్ కెప్టెన్సీపై కత్తి వేలాడుతోంది. అతను తన కెప్టెన్సీని కూడా కోల్పోవచ్చు. బాబర్ ఈ ప్రపంచకప్‌లో బ్యాట్స్‌మెన్‌గా కూడా విఫలమయ్యాడు. ఈ ప్రపంచకప్‌లో, అతను నాలుగు అర్ధ సెంచరీల ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ఒక్కదానిలో కూడా తన జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..