AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 బంతుల్లో 6 వికెట్లు.. ప్రపంచ క్రికెట్‌లోనే తొలి బౌలర్‌గా భారీ రికార్డ్.. ఎవరు, ఎక్కడ జరిగిందంటే?

ఆస్ట్రేలియాలో, ఒక ఫాస్ట్ బౌలర్ నమ్మడానికి కష్టమైన పనితో సంచలనంగా మారాడు. ఆస్ట్రేలియా మూడో డివిజన్ క్లబ్ క్రికెటర్ గారెత్ మోర్గాన్ వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టాడు. ఈ డబుల్ హ్యాట్రిక్ ఆధారంగా, అతని జట్టు దాదాపు ఓడిపోయిన మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ అద్భుతమైన మ్యాచ్ ఎక్కడ, ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

6 బంతుల్లో 6 వికెట్లు.. ప్రపంచ క్రికెట్‌లోనే తొలి బౌలర్‌గా భారీ రికార్డ్.. ఎవరు, ఎక్కడ జరిగిందంటే?
gareth-morgan-6-ball-6-wickets
Venkata Chari
|

Updated on: Nov 13, 2023 | 8:45 PM

Share

క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గెలుపొందిన జట్టు అకస్మాత్తుగా ఓడిపోతుంటాయి. ఇలాంటి మ్యాచ్‌లు తరచుగా కనిపిస్తాయి. అయితే, ఓడిపోయిన జట్టు అకస్మాత్తుగా గెలుస్తుంది. ఇటీవల, ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఓటమి అంచున ఉన్నప్పటికి గ్లెన్ మాక్స్‌వెల్ డబుల్ సెంచరీ సాధించి ఆస్ట్రేలియాను గెలిపించాడు. మాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత, తన సొంత దేశానికి చెందిన ఒక ఆటగాడు ఎవరూ నమ్మని రికార్డుతో షాక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడో డివిజన్ క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో ఓ బౌలర్ వరుసగా 6 బంతుల్లో 6 వికెట్లు తీశాడు.

ముగ్గీరబా నెరంగ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ క్లబ్, సర్ఫర్స్ ప్యారడైజ్ మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో, సర్ఫర్స్ ప్యారడైజ్ చివరి ఓవర్‌లో విజయానికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా కేవలం 4 వికెట్లు మాత్రమే పడిపోయాయి. ఈ మ్యాచ్‌లో ఈ జట్టు చాలా సులభంగా గెలిచింది. అయితే చివరి ఓవర్‌లో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది.

గారెత్ మోర్గాన్ విధ్వంసం..

ముద్గీరబా నెరంగ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ క్లబ్ కెప్టెన్ గారెత్ మోర్గాన్ చివరి ఓవర్ బౌలింగ్ చేశాడు. ఈ ఆటగాడు తొలి బంతికే వికెట్ తీశాడు. ఆ తర్వాత రెండో బంతికి, మూడో బంతికి వికెట్‌ తీసి హ్యాట్రిక్‌ సాధించాడు. మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. ముర్గీరాబా క్లబ్ ఇప్పుడు విజయంపై ఆశలు పెట్టుకుంది. అయినప్పటికీ, సర్ఫర్స్ ప్యారడైజ్‌కి ఇంకా 3 బంతుల్లో 5 పరుగులు మాత్రమే అవసరం. అది సాధ్యమైంది. అనంతరం మోర్గాన్ తర్వాతి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. అతని జట్టు కూడా గెలిచింది. ఈ ఆటగాడు 6 బంతుల్లో 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

మొదటిసారి ఇలా..

గారెత్ మోర్గాన్ వేసిన చివరి ఓవర్ తొలి నాలుగు బంతుల్లోనే బ్యాట్స్‌మెన్ క్యాచ్‌లు పట్టగా, చివరి ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు బౌల్డ్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో మోర్గాన్ 7 ఓవర్లలో 16 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. ఒక ఆటగాడు ఒకే ఓవర్‌లో 6 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ప్రొఫెషనల్ క్రికెట్‌లో, ఒక ఓవర్‌లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన నీల్ వాగ్నర్, బంగ్లాదేశ్‌కు చెందిన అల్ అమీన్ హుస్సేన్, భారత ఆటగాడు అభిమన్యు మిథున్‌ల పేరిట ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..