T20 World Cup 2024: బదులుతో పాటు భారీ విజయం కావాల్సిందే.. ఇవాళ లంకతో టీమిండియా కీలక మ్యాచ్
ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 12వ మ్యాచ్‌లో భాగంగా బుధవారం (అక్టోబర్ 09) టీమ్ ఇండియా, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య ఇది మూడో మ్యాచ్. ఇరు జట్లకు ఇది చాలా కీలకమైన మ్యాచ్. ఈ టోర్నీలో శ్రీలంక తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కాబట్టి శ్రీలంక పోరాటం ముగిసినట్టే.
ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 12వ మ్యాచ్‌లో భాగంగా బుధవారం (అక్టోబర్ 09) టీమ్ ఇండియా, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య ఇది మూడో మ్యాచ్. ఇరు జట్లకు ఇది చాలా కీలకమైన మ్యాచ్. ఈ టోర్నీలో శ్రీలంక తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కాబట్టి శ్రీలంక పోరాటం ముగిసినట్టే. మరోవైపు ఓటమితో టోర్నీని ఆరంభించిన టీమిండియా రెండో మ్యాచ్ లో విజయం సాధించింది. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. అయితే సెమీ ఫైనల్స్ లో టీమిండియా తన బెర్తును నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. కాగా కొన్ని రోజుల క్రితం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాపై శ్రీలంక విజయం సాధించింది. ఆ పరాజయానికి ఇప్పుడు బదులు తీర్చుకునే అవకాశం టీమ్ ఇండియాకు వచ్చింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు సెమీఫైనల్‌కు మరింత బలపడే అవకాశం టీమిండియాకు ఉంది. మెడ గాయం కారణంగా హర్మన్‌ప్రీత్ కౌర్ మ్యాచ్‌కు దూరంగా ఉండవచ్చు, ఈ సందర్భంలో స్మృతి మంధాన భారత జట్టుకు నాయకత్వం వహించవచ్చు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగే అవకాశం ఉంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాబట్టి టాస్ 7 గంటలకు ఉంటుంది. ఇండియా vs శ్రీలంక మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో టీవీలో అందుబాటులో ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో మొబైల్‌లో చూడవచ్చు.
భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సజీవన్ సజ్నా, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్, సింగ్, పూజా వస్త్రావ్, పూజా వస్త్రావ్ దయాళన్ హేమలత, యాస్తిక భాటియా.
శ్రీలంక మహిళల జట్టు:
చమరి ఆటపట్టు (కెప్టెన్), విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, హాసిని పెరీరా, అనుష్క సంజీవని (వికెట్ కీపర్), సుగంధికా కుమారి, ఇనోషి ప్రియదర్శిని, ఉదేశిక ప్రబోధని, ఉదేశిక ప్రబోధని, ఉదేశిక ప్రబోధని, ఇనో ప్రబోధని , అచ్చిని కులసూర్య, సచిన్ నిసంసాలా, శశిని గిమ్హాని.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..