నాలుగో టెస్టుకు అందుబాటులోకి ఆ డేంజరస్ ప్లేయర్

Velpula Bharath Rao

19 December 2024

భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో 4వ మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు ట్రావిస్ హెడ్ అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్నాయి.

బ్రిస్బేన్‌లో జరుగుతున్న 3వ టెస్టు మ్యాచ్‌లో తలకు గాయం కావడంతో 4వ మ్యాచ్‌‌లో హెడ్ ఆడుతాడో లేదో అని అనుమానులు వ్యక్తమవుతున్నాయి. 

నా గాయం తీవ్రంగా లేదు. కాలు నొప్పిగా అంతగా లేదు. వచ్చే టెస్టు మ్యాచ్ నాటికి పూర్తిగా గాయం నయమవుతుందని హెడ్ స్పష్టం చేశాడు.

ట్రావిస్ హెడ్ గాయం తీవ్రంగా లేదని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ క్లారిటీ ఇచ్చాడు. అయితే బాక్సింగ్ డే టెస్టుకు హెడ్ అందుబాటులో ఉంటాడని తెలిపాడు.

మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్ నాటికి నేను పూర్తి ఫిట్‌గా ఉంటాను. డిసెంబర్ 26 నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో ఆడతాననే నమ్మకం ఉందని ట్రావిస్ హెడ్ తెలిపాడు. 

ఇప్పుడు నాలుగో మ్యాచ్‌కు హెడ్ అందుబాటులో లేకుండా పోతున్నాడన్న వార్తలతో కాస్త ఊపిరి పీల్చుకున్న టీమ్ ఇండియా మళ్లీ హెడ్ కోసం వ్యూహం రచించాల్సి వస్తుంది.

ఈ BGT సిరీస్‌లోని 2వ, 3వ టెస్టులో బోర్డర్-గవాస్కర్ వరుసగా 140, 152 పరుగులు చేశారు. దీంతో టీమిండియాకు  హెడ్ "హెడ్ ఏక్" గా మారాడు.