Mithali Raj: 5 ప్రపంచ కప్‌లు.. 2 ఫైనల్స్.. 1000 ప్లస్ రన్స్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన భారత సారథి
భారత్ తరఫున అత్యధిక ప్రపంచకప్‌లు ఆడిన మహిళా క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ నిలిచింది. ఐదు ప్రపంచకప్‌ల్లో భారత కెప్టెన్ ఎన్నో రికార్డులు సృష్టించింది.
భారతదేశంలో మహిళా క్రికెట్ జట్టు(Indian Women Cricket Team) గుర్తింపు కొన్నాళ్ల క్రితం వరకు కేవలం ఒకరిద్దరు పేర్లకే పరిమితమైంది. రెండు దశాబ్దాలకు పైగా టీమ్ ఇండియా జెర్సీని ధరించి మైదానంలోకి దిగిన మిథాలీ రాజ్(Mithali Raj) మహిళల క్రికెట్‌లో ఎన్నో రికార్డులను నెలకొల్పింది. మిథాలీ పేరిట నమోదైన ప్రపంచ రికార్డులే ఇందుకు కారణంగా నిలిచాయి. ఆమెను మహిళల క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అని పిలించేందుకు కారణం కూడా ఇదే. అయితే, మిథాలీ అంతర్జాతీయంగా అలాంటి స్థానాన్ని సాధించడంతో అందరి కంటే విభిన్నంగా నిలిపింది.
మార్చి 6న మిథాలీ రాజ్ ఆరో ప్రపంచకప్ ఆడింది. ఆమె జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇది ఐదోసారి. మిథాలీ ప్రపంచకప్ ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. గత 22 ఏళ్లలో ఆమె ఐదు ప్రపంచ కప్‌లు ఆడింది. అందులో ఆమె పేరు మీద చాలా పెద్ద రికార్డులు ఉన్నాయి. ప్రపంచకప్‌లో మిథాలీ 1000కు పైగా పరుగులు చేసింది. ఇప్పటి వరకు టైటిల్ గెలవనప్పటికీ, ఈసారి తన కలను నెరవేర్చుకోవాలనుకుంటోంది.
ప్రపంచకప్‌లో మిథాలీ పేరిట ఎన్నో రికార్డులు.. వన్డే ప్రపంచకప్‌లో మిథాలీ మొత్తం 31 మ్యాచ్‌లు ఆడింది. ఈ 31 మ్యాచ్‌ల్లో ఆమె 54.23 సగటుతో 1139 పరుగులు చేసింది. రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో జట్టుకు నాయకత్వం వహించిన ఏకైక మహిళా క్రీడాకారిణిగా మిథాలి నిలిచింది. 2005, 2017 సంవత్సరాల్లో భారత్ రన్నరప్‌గా నిలిచింది. రెండు సార్లు జట్టు కమాండ్ మిథాలీ చేతిలోనే ఉంది. ప్రపంచ కప్‌లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత్‌లో మొదటి క్రికెట్ ప్లేయర్, అలాగే ప్రపంచంలో ఐదవ క్రీడాకారిణిగా మిథాలీ నిలిచింది.
ప్రతి ప్రపంచకప్‌లోనూ మిథాలీ బ్యాట్ నిప్పుల వర్షం కురిపిస్తోంది.. మిథాలీ కేవలం 14 ఏళ్ల వయసులో 1997 మహిళల ప్రపంచకప్‌కు ఎంపికైంది. అయితే తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే, దీని తర్వాత 2000 సంవత్సరంలో న్యూజిలాండ్‌లో నిర్వహించిన ప్రపంచ కప్ బరిలో నిలిచింది. ఇందులో మిథాలీ మూడు మ్యాచ్‌ల్లో 76.00 సగటుతో 152 పరుగులు చేసింది. దీని తరువాత, ఆమె 2005 ప్రపంచ కప్‌లో జట్టుకు కెప్టెన్‌గా మారింది. దక్షిణాఫ్రికాలో 49.75 సగటుతో 199 పరుగులు చేసింది. ఈ ఏడాది జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. అదే సమయంలో, 2009లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ కప్‌లో, తన బ్యాట్‌తో ఏడు మ్యాచ్‌లలో 71.75 సగటుతో 247 పరుగులు చేసింది.
మిథాలీ రాజ్ @ 6వ ప్రపంచకప్.. 2013 ప్రపంచకప్ భారతదేశంలో ఆడిన మిథాలీకి నాలుగో ప్రపంచకప్. ఇక్కడ ఆమె నాలుగు మ్యాచ్‌ల్లో 66.00 సగటుతో 132 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. గత ప్రపంచకప్‌లోనూ ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. 2017లో ఇంగ్లండ్‌లో జరిగిన ఈ ప్రపంచకప్‌లో కూడా మిథాలీ కీలక పాత్ర పోషించింది. ఆమె 9 మ్యాచ్‌ల్లో 45.44 సగటుతో 409 పరుగులు చేసింది.