IND vs SL: శ్రీలంకపై తగ్గేదేలే అంటోన్న జడేజా.. 60 ఏళ్ల ఆ రికార్డులో చేరిన తొలి ఇండియన్ ప్లేయర్..

Ravindra Jadeja: నిజానికి మొహాలీ టెస్టులో రవీంద్ర జడేజా తన ఆటతో మ్యాజిక్ చేశాడు. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో విధ్వంసం సృష్టించాడు.

IND vs SL: శ్రీలంకపై తగ్గేదేలే అంటోన్న జడేజా.. 60 ఏళ్ల ఆ రికార్డులో చేరిన తొలి ఇండియన్ ప్లేయర్..
Ravindra Jadeja
Follow us

|

Updated on: Mar 06, 2022 | 12:48 PM

రవీంద్ర జడేజా(Ravindra Jadeja) తన ఎడమ చేతితో శ్రీలంకను చిత్తు చేశాడు. ముందుగా బ్యాట్‌తో దంచికొట్టి, ఆ తర్వాత బంతితో చుక్కలు చూపించాడు. గత 60 ఏళ్లలో శ్రీలంక (Sri Lanka)పై గొప్ప స్క్రిప్ట్ రాసిన తొలి భారతీయ క్రికెటర్‌గా నిలిచాడు. మొహాలీ టెస్టు (Mohali Test)తొలి ఇన్నింగ్స్‌లో జడేజా అద్భుత ప్రదర్శన కారణంగా శ్రీలంక ఫాలోఆన్‌ ఆడాల్సి వచ్చింది. అంటే భారత్ భారీ విజయం దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. రవీంద్ర జడేజా చేసిన అద్భుతం ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి.

నిజానికి మొహాలీ టెస్టులో రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు. శ్రీలంకపై తొలుత బ్యాటింగ్‌లో భారీ ఇన్నింగ్స్‌ ఆడిన జడేజా.. ఆ తర్వాత బంతితో విధ్వంసం సృష్టించాడు. ఇలా చేస్తూనే జడేజా రికార్డు కూడా సృష్టించాడు.

బిషన్ సింగ్ బేడీతో సమానంగా నిలిచిన జడేజా..

శ్రీలంకతో మొహాలీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా తొలుత బ్యాటింగ్‌తో 175 పరుగులు చేశాడు. తర్వాత బంతితో 41 పరుగులకే 5 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో జడేజాకి ఇది రెండో సెంచరీ. కాగా, బంతితో 10వ సారి 5 వికెట్లు పడగొట్టాడు. సొంతగడ్డపై 8వ సారి 5 వికెట్లు పడగొట్టి లెఫ్టార్మ్ బౌలర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ విషయంలో బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న భారత రికార్డును సమం చేశాడు.

60 ఏళ్ల తర్వాత భారత క్రికెట్‌లో..

60 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో తొలిసారిగా, ఒక ఆటగాడు టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన మూడో భారతీయుడిగా జడేజా నిలిచాడు. భారత క్రికెట్‌లో తొలిసారిగా 1952లో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో వినూ మన్కడ్ ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత 1962 సంవత్సరంలో, పాలీ ఉమ్రిగర్ ఆ ఫీట్‌ను పునరావృతం చేసిన రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఇక, 60 ఏళ్ల తర్వాత జడేజా ఈ జాబితాలో మూడో ఆటగాడిగా చేరాడు.

సొంతగడ్డపై బిషన్ సింగ్ బేడీ రికార్డును బంతితో సమం చేసిన జడేజా..

మొహాలీలో బ్యాట్‌తో కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం టెస్టుల్లో 7వ ర్యాంక్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచిన జడేజా.. టెస్టు క్రికెట్‌లో 36.46 సగటును కలిగి ఉన్నాడు. బౌలింగ్‌లో అతని సగటు 24.50గా నిలిచింది. ఈ రెండు గణాంకాలు జడేజాను గొప్ప ఆల్ రౌండర్‌గా మార్చడానికి సరిపోతాయనడంలో సందేహం లేదు.

Also Read: Mithali Raj: 5 ప్రపంచ కప్‌లు.. 2 ఫైనల్స్.. 1000 ప్లస్ రన్స్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన భారత సారథి

IND vs SL, 1st Test, Day 3, LIVE Score: రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక.. కపిల్ రికార్డును సమం చేసిన అశ్విన్

IND vs PAK, LIVE Score, ICC Women’s World Cup 2022: 7వ వికెట్ కోల్పోయిన పాక్.. విజయానికి చేరువైన టీమిండియా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో