AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన టీమిండియా నయా సెన్సేషన్‌.. కోహ్లీ, రోహిత్‌ ఏయే స్థానాల్లో ఉన్నారంటే?

ఐసీసీ వన్డే బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. కొత్త ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంనే మళ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. టీం ఇండియా యువ బ్యాటర్‌ శుభ్‌మన్ గిల్ 4వ స్థానంలోకి దూసుకొచ్చాడు . శుభ్‌మన్ గిల్ మినహా మరే ఇతర భారత బ్యాటర్లు టాప్-5 జాబితాలో చోటు దక్కించుకోలేదు. గిల్‌ తర్వాత టాప్ టెన్‌లో విరాట్ కోహ్లీ 9వ స్థానంలో నిలిచాడు.  కాగా ఆసియా కప్ ప్రారంభానికి వారం మాత్రమే మిగిలి ఉంది.

ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన టీమిండియా నయా సెన్సేషన్‌.. కోహ్లీ, రోహిత్‌ ఏయే స్థానాల్లో ఉన్నారంటే?
Team India
Basha Shek
|

Updated on: Aug 23, 2023 | 5:23 PM

Share

ఐసీసీ వన్డే బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. కొత్త ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంనే మళ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. టీం ఇండియా యువ బ్యాటర్‌ శుభ్‌మన్ గిల్ 4వ స్థానంలోకి దూసుకొచ్చాడు . శుభ్‌మన్ గిల్ మినహా మరే ఇతర భారత బ్యాటర్లు టాప్-5 జాబితాలో చోటు దక్కించుకోలేదు. గిల్‌ తర్వాత టాప్ టెన్‌లో విరాట్ కోహ్లీ 9వ స్థానంలో నిలిచాడు.  కాగా ఆసియా కప్ ప్రారంభానికి వారం మాత్రమే మిగిలి ఉంది. తద్వారా తదుపరి ర్యాంకింగ్‌లో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే టాప్ టెన్‌లో ఐదుగురు ఆసియా బ్యాటర్లు ఉండడం గమనార్హం. ఇక టీ20 ల విషయానికొస్తే.. సూర్య కుమార్‌ యాదవ్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. మహ్మద్‌ రిజ్వాన్‌ (2), బాబర్‌ ఆజం (3), ఐడెన్‌ మర్‌క్రమ్‌ (4), రిలీ రౌసో(5) టాప్‌-5లో ఉన్నారు. సూర్యకుమార్‌ మినహా టాప్‌-10 మరే టీమిండియా క్రికెటర్లు లేరు. టెస్ట్‌ బ్యాటర్ల విషయానికొస్తే.. టాప్‌-10లో రోహిత్‌ శర్మ మాత్రమే స్థానం సంపాదించుకున్నాడు. కేన్‌ విలియమ్సన్‌ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. టెస్ట్‌ బౌలర్ల విషయానికొస్తే.. రవిచంద్రన్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు. అలాగే టెస్ట్‌ ఆల్‌రౌండర్ల లిస్టులో రవీంద్ర జడేజాదే టాప్‌ ప్లేస్‌. ఇక వన్డే బౌలర్ల జాబితాలో ఆసీస్‌ బౌలర్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. అలాగే కుల్‌ దీప్‌ పదో స్థానంలో కొనసాగుతున్నాడు.

ICC వన్డే బ్యాటర్ల కొత్త ర్యాంకింగ్ జాబితా

  • బాబర్ ఆజం (పాకిస్తాన్)- 880 రేటింగ్ పాయింట్లు\
  • రస్సీ వాండర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా)- 777
  • ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్)- 752
  • శుభమాన్ గిల్ (భారతదేశం) – 743
  • ఫఖర్ జమాన్ (పాకిస్తాన్)- 740
  • హ్యారీ టెక్టర్ (ఐర్లాండ్) – 726
  • డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 726
  • క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా)- 718
  • విరాట్ కోహ్లీ (భారతదేశం)- 705
  • స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 702

ఆసియా కప్ తర్వాత మారనున్న ర్యాంకింగ్స్..

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. సెప్టెంబరు 2న పాకిస్థాన్‌తో టీమిండియా ఆసియా పోరును ప్రారంభించనుంది. అలాగే ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరగనుంది.

ఇవి కూడా చదవండి

ఐసీసీ ర్యాంకింగ్స్ ఫుల్ లిస్ట్ కోసం క్లిక్ చేయండి..

బీసీసీఐ లేటెస్ట్ ట్వీట్స్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..