IND vs ENG 1st Test: సెంచరీతో ఫుల్ జోష్‌లో టీమిండియా కెప్టెన్.. కట్‌చేస్తే.. ఊహించని షాకివ్వనున్న ఐసీసీ..?
Team India Captain Shubman Gill: కెప్టెన్‌గా శుభమాన్ గిల్ అరంగేట్రంలోనే సెంచరీ సాధించి అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, ఈ చిన్న పొరపాటు అతనికి ఐసీసీ నుంచి హెచ్చరిక లేదా జరిమానాను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ విషయంపై మ్యాచ్ రిఫరీ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.

England vs India, 1st Test: ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో జరుగుతున్న ఇంగ్లాండ్ vs భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత కెప్టెన్ శుభమాన్ గిల్ అద్భుతమైన సెంచరీతో రాణించి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. అయితే, అతని కెప్టెన్సీ తొలి టెస్ట్‌లో ఐసీసీ నియమాలను ఉల్లంఘించినందుకుగాను జరిమానా ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
లీడ్స్ టెస్ట్ మొదటి రోజు, శుభమాన్ గిల్ బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు తెల్లటి సాక్స్‌లకు బదులుగా నలుపు రంగు సాక్స్‌లు ధరించి కనిపించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆటగాళ్లు తెల్లటి, క్రీమ్ రంగు లేదా లేత బూడిద రంగు సాక్స్‌లు మాత్రమే ధరించాలి అనేది ఐసీసీ దుస్తులు, పరికరాల నియమ నిబంధనలలోని క్లాజ్ 19.45 ప్రకారం స్పష్టంగా ఉంది. 2023 మే నుంచి ఈ నిబంధన అమలులో ఉంది.
ఈ నియమం ఉల్లంఘన ‘లెవెల్ 1’ నేరంగా పరిగణించబడుతుంది. దీనిపై మ్యాచ్ రిఫరీ తుది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఉల్లంఘన అని తేలితే, గిల్ తన మ్యాచ్ ఫీజులో 10 నుంచి 20 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. అయితే, సాక్స్‌లు తడిచిపోవడం లేదా ఇతర అనివార్య కారణాల వల్ల గిల్ నలుపు రంగు సాక్స్‌లు ధరించి ఉంటే, అతనికి జరిమానా నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది.
గతంలో కూడా ఐసీసీ డ్రెస్ కోడ్ ఉల్లంఘనలకు జరిమానాలు విధించింది. ఉదాహరణకు, 2021లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ తన జెర్సీపై రెయిన్‌బో రంగు చిహ్నం ఉన్నందుకు 15 శాతం జరిమానా చెల్లించాడు. అలాగే, 2019 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ అనధికారిక వాణిజ్య లోగోతో ఉన్న బ్యాట్‌ను ఉపయోగించి జరిమానా కట్టాడు.
కెప్టెన్‌గా శుభమాన్ గిల్ అరంగేట్రంలోనే సెంచరీ సాధించి అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, ఈ చిన్న పొరపాటు అతనికి ఐసీసీ నుంచి హెచ్చరిక లేదా జరిమానాను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ విషయంపై మ్యాచ్ రిఫరీ నుండి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..