ఇప్పుడు కొత్తగా కాదు.. 2019 నుంచే..! చాహల్ గర్ల్‌ఫ్రెండ్ RJ మహవాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
యుజ్వేంద్ర చాహల్‌తో డేటింగ్ వార్తల నేపథ్యంలో ఆర్జే మహవాష్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై ఆమె స్పందిస్తూ, తన వృత్తి జీవితం గురించి, నిశ్చితార్థం రద్దు గురించి వివరించింది. వివాహంపై తన అభిప్రాయాలు తెలియజేస్తూ.. ఇప్పుడు తనకు పెళ్లి గురించి ఆలోచన లేదని తెలిపింది.

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే మరో అమ్మాయితో కాస్త క్లోజ్‌గా ఉంటూ కనిపించాడు. ఆ అమ్మాయి పేరు మహవాష్. ఆమె ఆర్జే( రేడియా జాకీ)గా పనిచేస్తోంది. ఆమె పలు సందర్భాల్లో చాహల్‌తో కలిసి పలు మ్యాచ్‌లు చూసేందుకు వచ్చింది. అలాగే ఇటీవలె ముగిసిన ఐపీఎల్ 18వ సీజన్‌లో చాహల్ ప్రాతినిధ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టుకు సపోర్ట్ చేస్తూ కనిపించింది. అయితే.. చాహల్, మహవాష్ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం మొదలైంది.
ఈ విషయంలో కొంతమంది నెటిజన్లు మహవాష్‌ను ట్రోల్ చేస్తున్నారు. చాహల్‌తో క్లోజ్‌గా ఉండటం వల్లే ఈమెకు ఇంత క్రేజ్, పాపులారిటీ, సక్సెస్ వచ్చిందంటూ ఆమెను దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్‌పై మహవాష్ స్పందించింది. “జబ్ తక్ ఖుద్ కే లియే నహీ బోలోగే, కోయి తుమ్హారే లియే నహీ బోలేగా” (మీ కోసం మీరు మాట్లాడకపోతే, ఎవరూ మాట్లాడరు). నేను 2019 నుండి ఈ పరిశ్రమలో ఉన్నాను. రండి, వీటన్నింటికీ ముందు నేను ఏమి చేశానో మీకు చూపిస్తాను” అని ఆమె వీడియోలో ప్రకటించింది.
“నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే డేటింగ్ చేస్తాను. నేను పెళ్లి చేసుకోవాలనుకునే వారితోనే డేటింగ్ చేస్తాను కాబట్టి నేను సాధారణ డేటింగ్‌లకు వెళ్లను. ధూమ్ చిత్రంలో లాగా, తన భార్య, పిల్లలను బైక్ వెనుక చూసే వ్యక్తిని నేను. షాదీ కా కాన్సెప్ట్ సమాజ్ నహీ ఆ రహా హై (నాకు వివాహం అనే భావన అర్థం కాలేదు), అందుకే ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు” అని ఆమె మరింత వివరించింది. తనకు చిన్న వయసులోనే నిశ్చితార్థం జరిగిందని, ఆ తర్వాత అది రద్దు అయిందని మహవాష్ వెల్లడించింది. “నాకు 19 ఏళ్ల వయసులో నిశ్చితార్థం జరిగింది, 21 ఏళ్ల వయసులో దానిని ఆపివేశాను.” మహవాష్ తెలిపింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..