AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: పాకిస్తాన్‌కు ఇచ్చిపడేసిన ఐసీసీ.. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణపై స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం చెప్పిందంటే?

India vs Pakistan, T20I World Cup: 2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ చుట్టూ ఉన్న వివాదం మరింత ముదురుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం మ్యాచ్‌ను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయంతో ఐసీసీ అలెర్ట్ అయింది. దీంతో ఐసీసీ కఠిన వైఖరి తీసుకుంది.

IND vs PAK: పాకిస్తాన్‌కు ఇచ్చిపడేసిన ఐసీసీ.. టీమిండియాతో మ్యాచ్ బహిష్కరణపై స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం చెప్పిందంటే?
2024లో జరిగిన చివరి టీ20 ప్రపంచ కప్‌లో, రెండు జట్లు న్యూయార్క్‌లో తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు కేవలం 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 113 పరుగులు మాత్రమే చేసి 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Venkata Chari
|

Updated on: Feb 02, 2026 | 7:18 AM

Share

India vs Pakistan, T20I World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కాకముందే పాకిస్తాన్ ఐసీసీకి షాకిచ్చింది. ఇన్నాళ్లు ప్రపంచకప్ లో పాల్గొనబోమంటూ బెదిరించిన పాకిస్తాన్ టీం.. తాజాగా టోర్నీలో పాల్గొంటామని, కానీ భారత జట్టుతో మ్యాచ్ ఆడమంటూ తేల్చింది. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదంటూ చెప్పుకొచ్చింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ స్టేట్ మెంట్ ప్రకటించింది. భారత్ జట్టుతో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఆ వెంటనే అన్ని వైపుల నుంచి పీసీబీపై విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐసీసీ ఇప్పుడు పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఐసీసీ ఏం చెప్పిందంటే..?

ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఐసీసీ అన్నింటికంటే ముందు, నిష్పాక్షికమైన క్రికెట్ సంస్థ అని, టోర్నమెంట్లు సమగ్రత, పోటీ, స్థిరత్వం, న్యాయబద్ధత వంటి సూత్రాలపై ఆధారపడి పనిచేస్తోంది. జాతీయ విధాన విషయాలలో ప్రభుత్వాల పాత్రను ఐసీసీ గౌరవిస్తున్నప్పటికీ, ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్తాన్ అభిమానుల ప్రయోజనాలకు మంచిది కాదు. తన దేశంలో క్రికెట్‌కు గణనీయమైన, దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తుందని ఐసీసీ ఆశిస్తోంది. ఐసీసీ ప్రధాన ప్రాధాన్యత 2026 టీ20 ప్రపంచ కప్‌ను సజావుగా, విజయవంతంగా నిర్వహించడం, దీనిలో పాకిస్తాన్ పాల్గొనాలి. అన్ని వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే పరిష్కారాన్ని పాకిస్తాన్ కనుగొంటుందని మేం ఆశిస్తున్నాం అంటూ ప్రకటించింది.

పాకిస్తాన్ ఈ చర్య ఎందుకు తీసుకుంది?

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన హింస కారణంగా బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్‌ను 2026 ఐపీఎల్ సీజన్ నుంచి బీసీసీఐ తప్పించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ జట్టును భారతదేశానికి పంపబోమని పట్టుబట్టింది. తత్ఫలితంగా, ఐసీసీ బంగ్లాదేశ్‌ను ప్రపంచ కప్ నుంచి బహిష్కరించింది. పాకిస్తాన్ దీనిని సహించలేకపోయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచి, 2026 టీ20 ప్రపంచ కప్‌లో ఆ జట్టు ఆడాలా వద్దా అనే దానిపై ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని మీడియా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇప్పుడు, పాక్ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడటానికి వారి ప్రభుత్వం నిరాకరించింది. అయితే, పాకిస్తాన్ చివరి నిమిషం వరకు తమ నిర్ణయాన్ని మార్చుకుంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే, పాక్ క్రికెట్ బోర్డు అలా చేయకపోవడం వల్ల కలిగే పరిణామాలను వారి క్రికెట్ బోర్డు భరించలేకపోతుంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య గ్రాండ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న శ్రీలంకలో జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.