Shohidul Islam: క్రికెట్‌లో మళ్లీ డోపింగ్‌ కలకలం.. బంగ్లాదేశ్‌ క్రికెటర్‌పై అనర్హత వేటు వేసిన ఐసీసీ..

ICC: అంతర్జాతీయ క్రికెట్‌లో డోపింగ్‌ మళ్లీ కలకలం రేపింది. నిషేధిత ఉత్ర్పేరకాలు వాడినట్లు రుజువైనందుకు గాను బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ షోహిదుల్‌ ఇస్లాంపై ఐసీసీ అనర్హత వేటు వేసింది. ఈ ఏడాది మే 28 నుంచి

Shohidul Islam: క్రికెట్‌లో మళ్లీ డోపింగ్‌ కలకలం.. బంగ్లాదేశ్‌ క్రికెటర్‌పై అనర్హత వేటు వేసిన ఐసీసీ..
Shohidul Islam
Follow us
Basha Shek

|

Updated on: Jul 14, 2022 | 9:38 PM

ICC: అంతర్జాతీయ క్రికెట్‌లో డోపింగ్‌ మళ్లీ కలకలం రేపింది. నిషేధిత ఉత్ర్పేరకాలు వాడినట్లు రుజువైనందుకు గాను బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ షోహిదుల్‌ ఇస్లాంపై ఐసీసీ అనర్హత వేటు వేసింది. ఈ ఏడాది మే 28 నుంచి పది నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించింది. అన్ని ఫార్మాట్లకు ఈ అనర్హత వర్తిస్తుందని స్పష్టం చేసింది. నిషేధం పూర్తైన తర్వాత అంటే 2023 మార్చి 28 తర్వాతే మైదానంలోకి అడుగపెట్టాలని ఆదేశాలు జారిచేసింది. డోపింగ్ నిరోధక కోడ్ ఆర్టికల్ 2.1ని ఉల్లంఘించిన నేరాన్ని షోహిదుల్‌ అంగీకరించిన తరువాత ఐసీసీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ఉద్దేశ పూర్వకంగా తీసుకోలేదు..

షోహిదుల్‌ మూత్ర నమూనాలో నిషేధిత పదార్థం క్లోమిఫెన్ ఉన్నట్లు ఐసీసీ నిర్ధారించింది. అయితే ఉద్దేశ పూర్వకంగా అతను ఈ డ్రగ్‌ తీసుకోలేదని తెలియకుండానే తీసుకున్నాడని షోహిదుల్‌ అంగీకరించడంతో శిక్షను తగ్గించినట్లు ఐసీసీ పేర్కొంది. ‘అతను ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసమే ఈ మందులు తీసుకున్నాడు. అందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు అతనికి తెలియదు. అతను ఉద్దేశపూర్వకంగా ఈ డ్రగ్‌ తీసుకోలేదు. అందుకే అతనిపై కేవలం 10 నెలల నిషేధం విధించింది ఐసీసీ’ అని చెప్పుకొచ్చాడు. కాగా షోహిదుల్‌ ఇస్లాం ఇటీవల న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ల్లో పర్యటించిన బంగ్లాదేశ్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అయితే జట్టు సమీకరణల్లో భాగంగా అతనికి తుది జట్టులో అవకాశం లభించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..