World Cup 2023: హైదరాబాద్‌లో పాకిస్థాన్ జట్టు.. పోలీసులకు ఓవర్ టైం డ్యూటీ.. ఎందుకంటే?

Pakistan Cricket Team: కట్టుదిట్టమైన భద్రత మధ్య నగరం నడిబొడ్డున ఉన్న టీమ్ హోటల్‌కు తీసుకెళ్లే ముందు బుధవారం హైదరాబాద్ విమానాశ్రయంలో బృందానికి ఘనస్వాగతం లభించింది. దాదాపు రెండు వారాల పాటు టీమ్ ఇక్కడే ఉంటుంది. కాబట్టి, వారికి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చేందుకు పోలీసులు ఓవర్ టైం పనిచేస్తున్నారు. అదే సమయంలో నగరంలో గణేష్ నిమజ్జనం జరుగుతోంది. ఇటు నిమజ్జనం భద్రతోపాటు ఆటగాళ్లు ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నారు.

World Cup 2023: హైదరాబాద్‌లో పాకిస్థాన్ జట్టు.. పోలీసులకు ఓవర్ టైం డ్యూటీ.. ఎందుకంటే?
Pakistan Cricket Team
Follow us
Venkata Chari

|

Updated on: Sep 28, 2023 | 11:20 PM

Pakistan Cricket Team: ఏడేళ్ల తర్వాత భారత్‌ వచ్చిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు పర్యటన సజావుగా సాగేందుకు నగరంలోని పోలీస్ అధికారులు ఓవర్ టైం పని చేస్తున్నారు. వారికి పూర్తి భద్రత అందించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నగరం నడిబొడ్డున ఉన్న టీమ్ హోటల్‌కు తీసుకెళ్లే ముందు బుధవారం హైదరాబాద్ విమానాశ్రయంలో బృందానికి ఘనస్వాగతం లభించింది. దాదాపు రెండు వారాల పాటు టీమ్ ఇక్కడే ఉంటుంది. కాబట్టి, వారికి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చేందుకు పోలీసులు ఓవర్ టైం పనిచేస్తున్నారు. అదే సమయంలో నగరంలో గణేష్ నిమజ్జనం జరుగుతోంది. ఇటు నిమజ్జనం భద్రతోపాటు ఆటగాళ్లు ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నారు.

మరోవైపు న్యూజిలాండ్ జట్టులోని కొందరు ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకోగా, మిగిలిన ఆటగాళ్లు బుధవారం నగరానికి చేరుకోనున్నారు. పాకిస్థాన్ ఆటగాళ్లు దుబాయ్ మీదుగా బుధవారం రాత్రి 8.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో పాకిస్థాన్ జట్టుకు బస ఏర్పాటు చేశారు. న్యూజిలాండ్ జట్టుకు ఐటీసీ కాకతీయలో బస ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

“స్టేడియంలో లేదా హోటల్ వద్ద భద్రతతో జట్టు పూర్తిగా సంతృప్తి చెందింది” అని పీసీబీ ప్రకటించింది. శుక్రవారం జరిగే వార్మప్ గేమ్‌కు స్టేడియంలో దాదాపు 200 మంది పోలీసులు అవసరం. అందుకే ప్రేక్షకులకు అనుమతి లేకుండా చేశారు. అయితే, అక్టోబర్ 3న ప్రేక్షకులు తదుపరి సన్నాహక గేమ్‌కు తిరిగి వచ్చేసరికి వారి సంఖ్య 800కి చేరుకుంటుంది.

“పాకిస్తాన్‌తో సహా పోటీలో ఏ జట్టుకు ముప్పు లేదు. అయితే, చాలా కాలం తర్వాత పాకిస్థాన్ ఇక్కడకు రావడంతో, అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని టీమ్‌ల భద్రతకు సమానమైన ప్రాముఖ్యత ఉంది”అని ఓ భద్రతా అధికారి అన్నారు.

బీసీసీఐ చివరి నిమిషంలో షెడ్యూల్ మార్పులో భాగంగా, అక్టోబర్ 9, 10 తేదీలలో హైదరాబాద్ బ్యాక్-టు-బ్యాక్ గేమ్‌లను నిర్వహించవలసి వచ్చింది. ఇది పోలీసులపై మరింత ఒత్తిడిని పెంచింది.

“మా సిబ్బందిలో ఎక్కువమందికి ఆ రెండు రోజుల్లో నిద్రించడానికి చాలా తక్కువ సమయం మాత్రమే లభిస్తుంది. అక్టోబర్‌లో బ్యాక్-టు-బ్యాక్ గేమ్‌లకు కూడా ఇదే వర్తిస్తుంది” అని ఆ అధికారి తెలిపారు.

పార్క్ హయాత్ హోటల్ చేరుకున్న పాకిస్తాన్ జట్టు..

అభిమానులు లేకుండా పాకిస్థాన్ ప్రాక్టీస్ మ్యాచ్..

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 29న పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ మ్యాచ్‌కు ముందుగానే టిక్కెట్లను విక్రయించింది. అయితే, ఏకకాలంలో గణేశ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు ఉండడంతో మ్యాచ్ కు తగిన భద్రత కల్పించడం సాధ్యం కాదని హైదరాబాద్ పోలీసులు బోర్డుకు సమాచారం అందించారు. అందుకే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విక్రయించిన టిక్కెట్ల డబ్బును తిరిగి చెల్లిస్తోంది. అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియంలో వార్మప్ మ్యాచ్ ఆడాలని నిర్ణయించారు.

ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టసీ్ చేస్తున్న పాక్ జట్టు..

హైదరాబాద్‌లో మూడు కీలక మ్యాచ్‌లు..

దాదాపు 15 రోజుల పాటు పాక్ జట్టు హైదరాబాద్‌లోనే ఉండనుంది. పాకిస్థాన్ తన తొలి వార్మప్ మ్యాచ్‌లో సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 3న ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అంతేకాకుండా ప్రపంచకప్ టోర్నీలో మూడు ముఖ్యమైన మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఇందులో అక్టోబర్ 6న పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా, అక్టోబర్ 9న నెదర్లాండ్స్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. చివరగా అక్టోబర్ 12న శ్రీలంక, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..