Team India Squad: అక్షర్ పటేల్ ఔట్.. టీమిండియా వన్డే ప్రపంచకప్‌ స్వ్కాడ్‌లో కీలక మార్పు.. ఎవరొచ్చారంటే?

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ జట్టులోకి ఎంపికైన అశ్విన్ 2015 తర్వాత తొలిసారి వన్డే ప్రపంచకప్‌లో భాగం కానున్నాడు. నిజానికి ప్రపంచకప్‌నకు ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌లో భారత జట్టులోకి వచ్చిన అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇండోర్‌లోని ఫ్లాట్‌ పిచ్‌పై 3 వికెట్లు పడగొట్టి టీమిండియాకు గొప్ప విజయాన్ని అందించాడు.

Team India Squad: అక్షర్ పటేల్ ఔట్.. టీమిండియా వన్డే ప్రపంచకప్‌ స్వ్కాడ్‌లో కీలక మార్పు.. ఎవరొచ్చారంటే?
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Sep 28, 2023 | 10:01 PM

Axar Patel: 2023 ప్రపంచ కప్ (ODI World Cup 2023) కోసం భారత క్రికెట్ జట్టులో పెద్ద మార్పు వచ్చింది. గాయపడిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) స్థానంలో అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ టీమ్ ఇండియాకు ఎంపికయ్యాడు. నిజానికి ఆసియా కప్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడ్డాడు. కాబట్టి, అతను ఆసియా కప్ (Asia Cup 2023) ఫైనల్ మ్యాచ్ ఆడలేదు. అయితే, ప్రపంచకప్ నాటికి అక్షర్ కోలుకుంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), కోచ్ రాహుల్ ద్రవిడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం అక్షర్‌ను ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించారు. సెప్టెంబర్ 29 ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసేందుకు ఐసీసీ ఇచ్చిన చివరి గడువు కావడంతో అక్షర్ స్థానంలో అశ్విన్‌ను ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ నిర్ణయించింది.

ఇప్పుడు వన్డే ప్రపంచకప్ జట్టులోకి ఎంపికైన అశ్విన్ 2015 తర్వాత తొలిసారి వన్డే ప్రపంచకప్‌లో భాగం కానున్నాడు. నిజానికి ప్రపంచకప్‌నకు ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌లో భారత జట్టులోకి వచ్చిన అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా ఇండోర్‌లోని ఫ్లాట్‌ పిచ్‌పై అనుభవజ్ఞుడైన ఆఫ్‌ స్పిన్నర్‌ 3 వికెట్లు పడగొట్టి టీమిండియాకు గొప్ప విజయాన్ని అందించాడు. అప్పటి నుంచి అశ్విన్ కచ్చితంగా జట్టులోకి వస్తాడని అంతా అనుకున్నారు.

అక్షర్ గాయం అశ్విన్‌కు వరం..

ప్రపంచకప్‌నకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెప్టెంబర్ 5న బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మినహా అక్షర్ మూడో స్పిన్నర్. అయితే, ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో, అక్సర్ స్నాయువు (క్వాడ్రిస్ప్స్) గాయంతో బాధపడ్డాడు. దీంతో అతడు ఫైనల్ ఆడలేకపోయాడు. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను పిలిచారు. అయితే ఫైనల్‌ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ సుందర్‌తో పాటు అశ్విన్‌ కూడా ఆ స్థానానికి పోటీ చేస్తాడని తెలిసింది.

జట్టుతో కలిసిన అశ్విన్..

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి, రెండవ మ్యాచ్‌లలో సుందర్ స్థానంలో అశ్విన్ ప్లేయింగ్ XIలోకి వచ్చాడు. అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు మ్యాచుల్లోనూ 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత అక్షర్ పూర్తి ఫిట్ గా లేకుంటే అశ్విన్ ను వన్డే ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించారు. టీమ్ ఇండియా తమ సన్నాహక మ్యాచ్ కోసం గురువారం సాయంత్రం గౌహతి చేరుకున్నప్పుడు, అశ్విన్ అక్షర్‌కు బదులుగా జట్టుతో కనిపించి, అన్ని ఊహాగానాలకు ముగింపు పలికాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..