Big Bash League: BBLలో సెన్సషనల్ ఇన్సిడెంట్: ఇద్దరు బౌలర్లను సస్పెండ్ చేసిన అంపైర్లు! ఎందుకో తెలుసా?
బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లో రెనెగేడ్స్ బౌలర్లు విల్ సదర్లాండ్, ఫెర్గస్ ఓ'నీల్ డేంజర్ ఏరియాలో అడుగుపెట్టడంతో బౌలింగ్ నిషేధానికి గురయ్యారు. ఈ అరుదైన సంఘటన క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. నియమాల ప్రకారం, డేంజర్ ఏరియాలో మూడుసార్లు తప్పు చేస్తే బౌలర్‌ను సస్పెండ్ చేస్తారు. ఈ ఘటనకు కారణంగా, రెనెగేడ్స్ జట్టు బౌలింగ్ విభాగం దెబ్బతింది, బ్రిస్బేన్ హీట్ విజయాన్ని సాధించింది.

బిగ్ బాష్ లీగ్ (BBL) నెంబర్ 38 మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్-బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య చోటుచేసుకున్న ఒక అరుదైన సంఘటన క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్‌లో, రెనెగేడ్స్ బౌలర్లు విల్ సదర్లాండ్, ఫెర్గస్ ఓ’నీల్‌లు చేసిన ఒకే తప్పు కారణంగా బౌలింగ్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. వీరిద్దరూ తమ ఫాలో-త్రూ సమయంలో పిచ్‌పై డేంజర్ ఏరియాలో అడుగుపెట్టడం కారణంగా ఈ చర్యకు గురయ్యారు.
విల్ సదర్లాండ్ మెల్‌బోర్న్‌లోని డోక్‌లాండ్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 12వ ఓవర్‌లో మొదటి హెచ్చరిక అందుకున్నాడు. ఈ ఓవర్‌లో మాథ్యూ రెన్‌షా వరుస మూడు సిక్సర్లు కొట్టడంతో, సదర్లాండ్ తీవ్రంగా ఒత్తిడికి లోనయ్యాడు. ఈ ఒత్తిడితోనే, డేంజర్ ఏరియాలో అడుగుపెట్టినందుకు అంపైర్లు అతనిని బౌలింగ్ వేయకూడదని అడ్డుకున్నారు. ఇదే విషయాన్నీ జాక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ కామెంటేటర్లకు మైక్ ద్వారా అందిచాడు.
ఇక 16వ ఓవర్‌లో ఫెర్గస్ ఓ’నీల్ కూడా అదే తప్పు చేశాడు. ఫలితంగా, అతనికీ బౌలింగ్ చేయకుండా నిషేధం విధించారు. ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు బౌలర్లు బౌలింగ్ చేయకుండా నిషేధించబడడం క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.
నియమాల ప్రకారం…
డేంజర్ ఏరియా అనేది పాపింగ్ క్రీజ్‌ల మధ్యలో ఉన్న రక్షిత ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పిచ్ బాగు కోసం సురక్షితంగా ఉంచడం అవసరం. పదేపదే ఏ బౌలర్ అయినా ఈ ఏరియాలో అడుగుపెడితే ఇలాంటి నిషేధాలకు గురి అవ్వాల్సి ఉంటుంది. అయితే, మొదటి రెండు సార్లు తప్పు చేసిన బౌలర్‌కు హెచ్చరిక ఉంటుంది. మూడవసారి కూడా అదే తప్పు చేస్తే బౌలర్‌ను బౌలింగ్ నుంచి సస్పెండ్ చేస్తారు.
ఈ ఉత్కంఠభరిత బిగ్ బాష్ లీగ్ (BBL) మ్యాచ్‌లో, బ్రిస్బేన్ హీట్ 4 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించింది. ఈ సీజన్‌లో మార్వెల్ స్టేడియంలో ఇదే అత్యధిక స్కోర్. జాక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ అద్భుత ఆటతీరుతో 46 బంతుల్లో 95 పరుగులు చేసి రెనెగేడ్స్ పునరాగమనానికి ప్రయత్నించాడు.
అయితే, రెనెగేడ్స్ ప్రధాన బౌలర్లు సదర్లాండ్, ఫెర్గస్ ఓ’నీల్ నిషేధానికి గురవడంతో జట్టు బౌలింగ్ విభాగం దెబ్బతింది. ప్రత్యామ్నాయ బౌలర్‌గా జోష్ బ్రౌన్ బౌలింగ్ చేసినా, అనుభవం లేకపోవడం వల్ల 48 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.
మొత్తం రెండు ఓవర్లు మిగిలి ఉండగానే, రెనెగేడ్స్ బ్యాటింగ్ విఫలమవడంతో బ్రిస్బేన్ హీట్ ఈ మ్యాచ్‌ను గెలుచుకుని మున్ముందు పోటీకి తమ స్థానాన్ని బలపరుచుకుంది.
ఈ ఘటన క్రికెట్ చరిత్రలో మరో విచిత్రమైన పాఠం నేర్పే సంఘటనగా నిలిచిపోయింది. ఇలాంటి సంఘటనలు చూడటం అరుదు అయినప్పటికీ, ఆటగాళ్లు నియమాలకు తగ్గట్టుగా ఆడాల్సి ఉంటుంది. ఒక వేళా ఆట నిషేదానికి గురి అయితే అది ఆ జట్టుకు పెద్ద దెబ్బగా మారొచ్చు.
Melbourne Renegades captain Will Sutherland was removed from the bowling attack after this incident at Marvel Stadium. #BBL14 pic.twitter.com/wLXiM0CUJv
— KFC Big Bash League (@BBL) January 18, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..