IND vs ENG: ఇండియా, ఇంగ్లండ్ ఐదో టెస్టుపై వీడని సందిగ్ధత.. వాతావరణ నిపుణులు ఏమంటున్నారంటే?
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు గురువారం (మార్చి 7) నుంచి ప్రారంభం కానుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో టీమిండియా 3-1తో ముందంజలో ఉంది. రోహిత్ సేన ఇప్పుడు చివరి టెస్టులో కూడా గెలిచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు గురువారం (మార్చి 7) నుంచి ప్రారంభం కానుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో టీమిండియా 3-1తో ముందంజలో ఉంది. రోహిత్ సేన ఇప్పుడు చివరి టెస్టులో కూడా గెలిచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో తొలి సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ పునరాగమనం కోసం సాధన ప్రారంభించింది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగవచ్చు. అయితే ఈ ఉత్కంఠభరితమైన ఐదో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించవచ్చన్న నివేదికలు ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. ధర్మశాలలో జరిగే ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లు చాలా చలిగా ఉంటుంది. తొలిరోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 3, 4 రోజులలో ఎండ ఎక్కువగా ఉంటుంది. కానీ 5వ రోజు మళ్లీ మేఘావృతమై ఉంటుంది. చివరి రోజు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు వెలుతురు లేమీ ఆటకు అడ్డంకిగా మారవచ్చు.టీ తర్వాత ఫ్లడ్‌లైట్‌లను ఉపయోగించే అవకాశం ఉంది.
ఇక ధర్మశాల వాతావరణం ఆటగాళ్లకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, టాస్ గెలిచిన జట్టుకు ముందుగా బౌలింగ్ చేయడం ఉత్తమ ఎంపిక. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు బాగా అనుకూలింవచ్చని తెలుస్తోంది. రాంచీ టెస్టులో విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా ఐదో టెస్టులో తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రానున్నాడు. ధర్మశాలలో పరిస్థితిని బట్టి, రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, బుమ్రా రూపంలో ముగ్గురు పేసర్లను రంగంలోకి దించవచ్చు. భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే, రజత్ పాటిదార్ ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో నిరూపించుకోలేకపోయినప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అలాగే దేవదత్ పడిక్కల్ కూడా ఆడతాడని అంటున్నారు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ ధర్మశాలలో తన 100వ టెస్టు మ్యాచ్ ఆడనున్నాడు.
🚨Dharamshala temperatures are expected to drop to 1°C during India vs England 5th Test Match!#ICCWorldCup2023 #ICCCricketWorldCup #ODIWorldCup2023 #Cricket #CricketTwitter #INDvENG #INDvsENG #ENGvIND #ENGvsIND #INDvsENGTest #IPL2024 pic.twitter.com/jhyDX0HGhK
— CricketVerse (@cricketverse_) March 5, 2024
Dharamsala weather update, #INDvENG Will rain play spoilsport in India vs England 5th Test?#WTC25 #Cricket #CricketTwitter pic.twitter.com/8AtQDVJZSa
— TheCricketCorner (@TheCricCorner) March 4, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..