తీవ్ర జ్వరంతో గ్రౌండ్‌లోకి.. 152కు పైగా స్ట్రైక్ రేట్‌తో మెరుపు అర్ధసెంచరీ.. దురదృష్టకర రనౌట్‌తో చెదిరిన ప్రపంచకప్ కల
ఈ సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ కౌర్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. కానీ కీలక మ్యాచ్ కావడంతో ఆమె ఆడాలని నిర్ణయించుకుంది. భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బౌలర్లకు ఎదురొడ్డి అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించింది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలన్న కల మరోసారి అసంపూర్తిగా మిగిలిపోయింది. సరిగ్గా మార్చి 2020లో T20 ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి తర్వాత, 2023 T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లో అదే ఆస్ట్రేలియా జట్టు భారత క్రీడాభిమానుల కలలను చెరిపేసింది. కేప్ టౌన్‌లో జరిగిన సెమీ-ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. గెలుపునకు చేరువగా వచ్చి ఓటమి చెందడంతో ప్రపంచకప్‌ను గెల్చుకోవాలన్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కల మరోసారి చెదిరిపోయింది. ఈ సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ కౌర్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. కానీ కీలక మ్యాచ్ కావడంతో ఆమె ఆడాలని నిర్ణయించుకుంది. భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బౌలర్లకు ఎదురొడ్డి అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించింది. కానీ ఎప్పటిలాగే దురదృష్టం ఆమెను వెంటాడింది. కీలక సమయంలో రనౌట్ కావడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. ఇక్కడ దురదృష్టం అని ఎందుకంటున్నామంటే.. హర్మన్ సరిగ్గా క్రీజు దగ్గరకు వచ్చేసరికి ఆమె బ్యాట్ గ్రౌండ్‌లో చిక్కుకుపోయింది. అదే సమయంలో ఆసీస్ వికెట్ కీపర్ అలిస్సా హీలీ మెరుపువేగంతో స్టంప్ట్స్‌ను పడగొట్టడంతో కెప్టెన్ హర్మన్ నిరాశగా మైదానం విడిచి వెళ్లిపోయింది.
అప్పుడు మిథాలీ.. ఇప్పుడు కౌర్..
కాగా సరిగ్గా 6 సంవత్సరాల క్రితం ఇలాంటి ఘటనే ఒకటి టీమిండియా అభిమానులను విషాదంలో ముంచింది. ఇంగ్లండ్‌తో జరిగిన 2017 ODI ప్రపంచకప్ ఫైనల్‌లో, అప్పటి భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఇలాగే రనౌట్ అయ్యింది. ఆమె షూ స్పైక్ గ్రౌండ్‌లో ఇరుక్కుపోయి పరుగును పూర్తి చేయలేకపోయింది. ఆ ఫైనల్‌లోనూ భారత్ ఓడిపోయింది. తాజా మ్యాచ్‌లో హర్మన్ కూడా ఇలాగే ఔట్ అయ్యింది. టీమిండియా మ్యాచ్ ఓడిపోయింది.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..